అక్కతో ప్రియుడి రాసలీలలు.. తమ్ముడు చూడడంతో..



ప్రియురాలితో రాసలీలలు సాగిస్తుండగా చూశాడని ఆమె తమ్ముడిని కిరాతకంగా చంపేశాడో దుర్మార్గుడు. ఈ దారుణ ఘటన యూపీలోని బరేలీ జిల్లాలో చోటుచేసుకుంది. ఈధ్‌జాగిర్ గ్రామానికి చెందిన మైనర్ బాలికను అదే ప్రాంతానికి చెందిన యువకుడు(21) ప్రేమించుకుంటున్నారు. బాలిక తల్లిదండ్రులు పనులకు వెళ్లిన సమయంలో ప్రియురాలిని కలిసేందుకు ప్రియుడు ఇంటికి వచ్చాడు. ఇద్దరూ రహస్యంగా రాసలీలలు సాగిస్తున్న సమయంలో ఆమె ఆరేళ్ల తమ్ముడు చూశాడు.

ఎక్కడ తమ వ్యవహారం ఇంట్లో చెప్పేస్తాడోనన్న భయంతో అక్ర ప్రియుడు బాలుడిని దారుణంగా చంపేశాడు. గొంతునులిమి అమానుషంగా హత్య చేశాడు. పని నుంచి ఇంటికి వచ్చిన తల్లిదండ్రులకు డాబాపై నుంచి పడి తమ్ముడికి గాయాలయ్యాయని బాలిక అబద్ధం చెప్పింది. కంగారుపడిన తల్లిదండ్రులు వెంటనే బాలుడిని ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే అప్పటికే బాలుడు మరణించాడని వైద్యులు చెప్పడంతో శోకసంద్రంలో మునిగిపోయారు.

Also Read:

కుటుంబ సభ్యులు బాలుడి అంత్యక్రియలు నిర్వహించారు. తమ్ముడు మరణానికి కారణం తెలిసి కూడా అబద్ధం చెప్పానన్న బాధతో అక్క కుమిలిపోయింది. చివరికి ధైర్యం చేసి తల్లిదండ్రులకి అసలు నిజం చెప్పేసింది. తన ప్రియుడే తమ్ముడిని గొంతునులిమి చంపేశాడని చెప్పడంతో పేరెంట్స్ పోలీసులను ఆశ్రయించారు. హత్య కేసు నమోదు చేసిన పోలీసులు బాలికని అదుపులోకి తీసుకుని జువైనెల్ హోమ్‌కి తరలించారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. బాలిక మైనర్ కావడంతో నిందితుడిపై రేప్ కేసు కూడా నమోదైంది.

Read Also:



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *