అక్తర్ బౌన్సర్‌కి సచిన్ కళ్లు మూసుకునేశాడు.. నేనే సాక్షి: ఆసిఫ్పాకిస్థాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ వేగవంతమైన బౌన్సర్లకి అప్పట్లో కళ్లు మూసుకునేశాడని అక్తర్ సహచర బౌలర్ మహ్మద్ ఆసిఫ్ వెల్లడించాడు. 2006లో భారత్, పాకిస్థాన్ మధ్య జరిగిన టెస్టు సిరీస్‌లో షోయబ్ అక్తర్ నిప్పులు చెరిగే బౌన్సర్లు సంధించాడని చెప్పుకొచ్చిన ఆసిఫ్.. సచిన్ ఆ బంతుల్ని ఎదుర్కొనేందుకు ఇబ్బందిపడ్డాడని గుర్తు చేశాడు. ఆ మ్యాచ్‌లో ఇర్ఫాన్ పఠాన్ హ్యాట్రిక్ వికెట్లు పడగొట్టినా.. పాకిస్థాన్ 341 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది.

Read More:

‘‘మ్యాచ్ ఆరంభంలో ఇర్ఫాన్ పఠాన్ హ్యాట్రిక్ వికెట్లు పడగొట్టాడు. దాంతో.. పాక్ టీమ్‌ ఒత్తిడిలో పడింది. కానీ.. కమ్రాన్ అక్మల్ సెంచరీతో మళ్లీ టీమ్‌ని మ్యాచ్‌లోకి తెచ్చాడు. మొత్తంగా.. ఫస్ట్ ఇన్నింగ్స్‌లో పాక్ 240 పరుగులకి ఆలౌటవగా.. అనంతరం పాక్ బౌలింగ్‌ దాడిని ప్రారంభించింది. ఈ క్రమంలో షోయబ్ అక్తర్ మెరుపు బౌన్సర్లని సంధించాడు. నేను స్క్వేర్‌లెగ్‌లో అంపైర్‌కి సమీపంలో ఫీల్డింగ్ చేస్తుండగా.. షోయబ్ అక్తర్ విసిరిన ఓ రెండు బౌన్సర్లకి బ్యాటింగ్‌ చేస్తున్న సచిన్ కళ్లు మూసుకోవడాన్ని నేను చూశాను. టీమిండియా క్రికెటర్లు బ్యాక్‌ఫుట్‌పై ఆడేందుకు ట్రై చేశారు. కానీ.. మేము ఆ మ్యాచ్‌లో వారికి ఆ అవకాశం ఇవ్వలేదు’’ అని ఆసిఫ్ వెల్లడించాడు.

Must Read:

2003లో షోయబ్ అక్తర్ సంధించిన బౌన్సర్‌ని చాకచక్యంగా అప్పర్‌ కట్ రూపంలో సచిన్ టెండూల్కర్ సిక్స్‌గా బాదిన విషయం తెలిసిందే. ఆ తర్వాత కూడా ఎన్నోసార్లు అక్తర్ బౌలింగ్‌ని సచిన్ ఉతికారేశాడు. అయితే.. ఇప్పటికీ క్రికెట్ ప్రపంచలో అత్యంత వేగవంతమైన బంతిని విసిరిన బౌలర్‌గా అక్తర్ కొనసాగుతున్నాడు. 2003 వన్డే ప్రపంచకప్‌లో అక్తర్ గంటకి 161.3కిమీ వేగంతో బంతిని విసిరాడు.Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *