అజహరుద్దీన్ ప్లిక్ షాట్.. నీలా ఎవరూ ఆడలేరంటూ నెటిజన్స్ కితాబుభారత మాజీ కెప్టెన్ మళ్లీ బ్యాట్ పట్టాడు. హైదరాబాద్ క్రికెట్ అసోషియేషన్ (హెచ్‌సీఏ) అధ్యక్షుడిగా ప్రస్తుతం కొనసాగుతున్న అజహరుద్దీన్.. తాజాగా రాజీవ్ గాంధీ స్టేడియంలో కాసేపు సరదాగా క్రికెట్ ఆడాడు. ఆ వీడియోని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకోగా.. అతను ఆడిన ప్లిక్‌షాట్‌కి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

భారత టెస్టు జట్టులోకి 21 ఏళ్ల వయసులో అరంగేట్రం చేసిన మహ్మద్ అజహరుద్దీన్.. ఆడిన తొలి మూడు టెస్టుల్లోనూ సెంచరీలతో సరికొత్త రికార్డ్‌ నెలకొల్పాడు. మొత్తంగా 99 టెస్టులు, 334 వన్డేలాడిన అజహరుద్దీన్.. 2000లో ఫిక్సింగ్ వివాదంలో చిక్కుకున్నాడు. భారత్, దక్షిణాఫ్రికా మధ్య ఆ ఏడాది జరిగిన సిరీస్‌లో కొన్ని మ్యాచ్‌లు ఫిక్సింగ్‌కి గురవగా.. అందులో అజహరుద్దీన్ పాత్ర కూడా ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయి. దక్షిణాఫ్రికా అప్పటి కెప్టెన్ హాన్సీ క్రోన్జ్‌తో కలిసి బుకీలతో అజహరుద్దీన్ చర్చలు జరిపినట్లు వార్తలు వినిపించాయి.

ఫిక్సింగ్ ఆరోపణల కారణంగా అజహరుద్దీన్‌పై బీసీసీఐ జీవితకాలం నిషేధం విధించగా.. 2012లో ఆ నిషేధాన్ని ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్ ఎత్తివేసింది. అయినప్పటికీ హెచ్‌సీఏ ఎన్నికల్లో అతడ్ని కొందరు పోటీపడనివ్వలేదు. కానీ.. పోరాడిన అజహరుద్దీన్ ఎట్టకేలకి గత ఏడాది ఎన్నికల్లో పోటీ చేసి.. అధ్యక్షుడిగా ఎంపికయ్యాడు.Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *