అప్పటివరకు క్రీడా కార్యకలాపాలను వాయిదా వేయాలి: టీటీ ప్లేయర్ శరత్ కమల్ప్ర‌పంచ‌వ్యాప్తంగా క‌రోనా వైర‌స్ విస్త‌రిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టివ‌ర‌కు ప్ర‌పంచ‌వ్యాప్తంగా 30.90 ల‌క్ష‌ల‌మంది క‌రోనా పాజిటివ్‌గా తేలారు. అలాగే 2,12000 మందికిపైగా మ‌ర‌ణించారు. ఈ వైర‌స్ కార‌ణంగా ప్ర‌తిష్టాత్మ‌క ఒలింపిక్స్‌, ఐపీఎల్ సహా అన్ని టోర్నీలు వాయిదా ప‌డ్డాయి. ఈ వైర‌స్ విస్త‌ర‌ణ ఇంకా కొన‌సాగుతుండ‌టంతో ఈ టోర్నీలు ఎప్పుడు ప్రారంభ‌మ‌వుతాయో చెప్ప‌లేని ప‌రిస్థితి నెల‌కొని ఉంది. అయితే క‌రోనా వైర‌స్ వ్యాక్సిన్ వ‌చ్చే వ‌ర‌కు ఏ టోర్నీని నిర్వ‌హించకూడద‌ని భార‌త స్టార్ టేబుల్ టెన్నిస్ ప్లేయ‌ర్ అచంట శ‌ర‌త్ క‌మ‌ల్ వ్యాఖ్యానించాడు.

Must Read:
ప్ర‌తి టోర్నీలో ఆట‌గాళ్లంతా ద‌గ్గ‌ర‌గా మ‌స‌లుతుంటార‌ని, సోష‌ల్ డిస్టెన్సింగ్ పాటించే అవ‌కాశం లేద‌ని ఈ సంద‌ర్భంగా శ‌ర‌త్ గుర్తు చేశాడు. అలాగే ట్రైనింగ్ త‌దితర కార్య‌క్ర‌మాల సంద‌ర్భంగా ప్లేయ‌ర్లంతా ద‌గ్గ‌ర‌ద‌గ్గ‌ర‌గా ఉండాల్సి వ‌స్తుంద‌ని శ‌ర‌త్ తెలిపాడు. ఈ ఏడాది వ‌ర‌కు ఏ టోర్నీ జ‌ర‌గ‌బోద‌ని అంచ‌నా వేశాడు.

Must Read:
మ‌రోవైపు గ‌త‌నెల‌లో జ‌రిగిన ఒమ‌న్ ఓపెన్ సాధించిన శ‌ర‌త్‌.. ఒలింపిక్స్‌కు అర్హత సాధించాడు. ఇప్పటి వ‌ర‌కు మూడుసార్లు మెగాటోర్నీలో క‌మ‌ల్ ఆడాడు. ఇక టీటీ ర్యాంకింగ్స్‌లో 31వ స్థానంలో ఉన్న క‌మ‌ల్‌.. దేశంలోనే నెం.1 ప్లేయ‌ర్‌గా నిలిచాడు. ఇక టోక్యో ఒలింపిక్స్‌ను ఇప్ప‌టికే నిర్వాహ‌క క‌మిటీ వ‌చ్చే ఏడాదికి వాయిదా వేసిన సంగ‌తి తెలిసిందే.Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *