అలబామాలో దారుణం.. ఇంట్లో మంటలు, ఏడుగురి మృతదేహాలుజాతి వివక్ష ఘర్షణలతో అట్టుడుకుతున్న అమెరికాలో మరో దారుణం చోటు చేసుకుంది. రాష్ట్రంలోని వాల్హెర్‌మోసో స్ప్రింగ్స్‌లో ఓ ఇంట్లో ఏడుగురు వ్యక్తులు మంటల్లో దహనమవుతూ కనిపించారు. గుర్తు తెలియని వ్యక్తి/ వ్యక్తులు వారిని కాల్చి చంపారు. కాల్పుల కారణంగా చోటు చేసుకున్న మంటల్లో బాధితుల మృతదేహాలు కాలిపోయాయి. మంటల దాటికి ఇల్లు కూడా పాక్షికంగా ధ్వంసమైంది. అమెరికా కాలమానం ప్రకారం గురువారం (జూన్ 4) రాత్రి 11.30 గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది.

మోర్గాన్‌ కౌంటీ ప్రాంతంలోని ఓ ఇంట్లో కాల్పులు చోటు చేసుకున్నట్లు సమాచారం అదడంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. వారు అక్కడికి చేరుకునేసరికే ఆ ఇల్లు మంటల్లో దహనమవుతోంది. మంటలను అదుపులోకి తీసుకువచ్చి.. లోనికి వెళ్లి చూడగా ఏడుగురి మృతదేహాలు ఉన్నట్లు గుర్తించామని పోలీసులు తెలిపారు. బాధితుల్లో నలుగురు పురుషులు, ముగ్గురు మహిళలు ఉన్నట్లు వెల్లడించారు. ఘటనలో ఓ శునకం కూడా మరణించినట్లు పోలీసులు తెలిపారు.

ఈ దారుణానికి ఎవరు పాల్పడ్డారు? ఎందుకు పాల్పడ్డారు తదితర వివరాలు తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు. స్థానికులందరూ నిద్రిస్తున్న సమయంలో ఘటన జరగడంతో నిందితులను ఎవరూ చూడలేదని వివరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని.. ఇప్పటివరకూ ఎవరినీ అదుపులోకి తీసుకోలేదని పోలీసులు తెలిపారు.

Photo Credit: al.com

Also Read:Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *