అల్లంతో కలిగే ప్రయోజనాలేమిటీ? వేసవిలో తినొచ్చా?ల్లం ఆరోగ్యానికి ఎంత మంచిదో తెలిసిందే. అయితే, తినోచ్చా లేదా అనే చాలామంది సందేహాలు వ్యక్తం చేస్తారు. శరీరానికి వేడి చేస్తుందనే భయంతో అల్లాన్ని పూర్తిగా పక్కన పెడతారు. దీనివల్ల అల్లం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు శరీరానికి అందవు. కరోనా వైరస్ నేపథ్యంలో ప్రతి ఒక్కరిలో రోగ నిరోధక శక్తి పెరగాలి. మరి, ఇలాంటి విపత్కర పరిస్థితిలో అల్లాన్ని దూరంగా ఉంచడమంటే రిస్కు చేసినట్లే. మరి, వేసవిలో అల్లాన్ని తినొచ్చా? తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటీ? నష్టాలేమిటీ? ఎంత మొత్తంలో తినాలి తదితర వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

అల్లం వల్ల కలిగే ప్రయోజనాలు ఇవే:
❂ అల్లం తింటే జీర్ణక్రియ, జీవ క్రియ మెరుగుపడుతుంది.
❂ కొలెస్ట్రాల్ తగ్గించే గుణం అల్లంలో ఉంది. ఫలితంగా బరువు తగ్గుతారు.
❂ శరీరాన్ని వెచ్చగా ఉంచడానికి అల్లం సహకరిస్తుంది. అందువల్ల చలికాలంలో అల్లం తినడం మంచిది.
❂ అల్లం నోటి దుర్వాసనను పోగొడుతుంది.
❂ నోటిలోని ప్రమాదకర బ్యాక్టీరియా నుంచి దంతాలను రక్షిస్తుంది.
❂ అల్లం జీర్ణ శక్తిని పెంచుతుంది.
❂ జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది.
❂ అల్లం క్యాన్సర్ కారకాలతో పోరాడుతుంది.
❂ అల్లం మంచి యాంటీ ఆక్సిడెంటుగా పనిచేస్తుంది.
❂ శరీరాన్ని ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడుతుంది.
❂ శ్వాసకు సంబంధించిన సమస్యలను అల్లం పరిష్కరిస్తుంది.
❂ అల్లం ఒత్తిడిని తగ్గిస్తుంది.
❂ రక్తనాళాలను శుభ్రం చేసి రక్తప్రసరణ మెరుగుపరుస్తుంది.
❂ గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది.
❂ కడుపులో ఏర్పడే వికారం, వాంతులను తగ్గిస్తుంది.
❂ జాయి౦ట్‌లలో ఏర్పడే నొప్పుల నుండి ఉపశమనాన్ని ఇస్తుంది.

Also Read:

వేసవిలో అల్లం తినొచ్చా? ఎక్కువ తింటే ఏం జరుగుతుంది?:
✺ వేసవిలో అల్లం తినడం మంచిదే. చాలా తక్కువ మొత్తంలో తినాలి.
✺ వేసవిలో అల్లం చాయ్ తాగడం మంచిదే.
✺ అల్లం ఎక్కువ తింటే కడుపులో యాసిడ్ రిఫ్లక్స్, మంట కలిగిస్తుంది.
✺ వేసవిలో అర అంగుళం అల్లం ముక్కను వాడితే చాలు.
✺ వేసవిలో అల్లం తినడం వల్ల శరీరం వేడిక్కినా.. చెమట పుట్టించేందుకు సహకరిస్తుంది.
✺ చెమట వల్ల శరీరం చల్లబడుతుంది. దీన్నే ‘గస్టేటరీ చెమట’ అంటారు.
✺ రక్తస్రావం సమస్యలతో బాధపడేవారు అల్లం ఎక్కువగా తినకూడదు.
✺ మధుమేహం, గుండె నొప్పి సమస్యలతో బాధపడేవారు అల్లాన్ని మితంగా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *