అశ్విన్‌: కింగ్స్ ఎలెవ‌న్ పంజాబ్‌ను ఎందుకు వీడానంటే..?భార‌త సీనియ‌ర్ ఆఫ్ స్పిన్న‌ర్ ర‌విచంద్ర‌న్ అశ్విన్ గ‌త రెండు సీజ‌న్లుగా కింగ్స్ ఎలెవ‌న్ పంజాబ్ త‌ర‌పున ఆడిన సంగ‌తి తెలిసిందే. 2018 వేలంలో రూ.7.6 కోట్ల‌కు పంజాబ్ అత‌డిని కొనుగోలు చేసింది. వరుసగా రెండు ఏడాదుల్లోనూ అత‌ను జ‌ట్టుకు నాయ‌క‌త్వం వ‌హించాడు. అయితే వేలానికి ముందు అనూహ్యంగా అత‌ను పంజాబ్‌ను వీడి ఢిల్లీ క్యాపిట‌ల్స్ జ‌ట్టును చేరాడు. అప్ప‌ట్లో పంజాబ్ యాజ‌మాన్యంగానీ, అశ్విన్ గానీ దీనిపై స్పందించలేదు. తాజాగా ఢిల్లీ నిర్వహించిన ఓ కార్య‌క్ర‌మంలో అశ్విన్ ఈ ఘ‌న‌ట‌పై మ‌న‌సు మాట్లాడాడు.

Must Read:
యువ‌కుల‌తో నిండిన ఢిల్లీ అద్భుత‌మైన జ‌ట్టని అశ్విన్ కొనియాడాడు. గ‌తేడాది ప్లే ఆఫ్స్‌కు చేరింద‌ని గుర్తు చేశాడు. రిష‌భ్ పంత్‌, పృథ్వీ షా, శ్రేయ‌స్ అయ్య‌ర్ లాంటి ప్ర‌తిభ గ‌ల ఆట‌గాళ్లతో నిండిన ఢిల్లీ టైటిల్ సాధించ‌డం కోసం త‌న వంతు పాత్ర పోషించడం కోసం, ఆ జ‌ట్టులో చేరాన‌ని తెలిపాడు. త‌న రాకతో బౌలింగ్ మ‌రింత మెరుగుప‌డి టైటిల్ నెగ్గే అవ‌కాశాలు మెరుగుప‌డుతాయ‌నే కాంక్ష‌తోనే ఢిల్లీ చేరానని చెప్పుకొచ్చాడు.

Must Read:
మ‌రోవైపు అశ్విన్‌తోపాటు అజింక్య ర‌హానే కూడా ఈ ఏడాది ఢిల్లీ జ‌ట్టుతో చేరాడు. గ‌తేడాది రాజ‌స్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా అత‌ను వ్య‌వ‌హ‌రించాడు. సీనియ‌ర్ల రాక‌తో ఢిల్లీ మ‌రింత ప‌టిష్టమైంది. ఇక పంజాబ్ జ‌ట్టుకు కేఎల్ రాహుల్ ఇప్ప‌టిఏ కెప్టెన్‌గా ఎంపిక‌య్యాడు. రాజ‌స్థాన్‌ను స్టీవ్ స్మిత్ న‌డిపించే అవ‌కాశ‌ముంది. మ‌రోవైపు క‌రోనా వైర‌స్ కార‌ణంగా ఈ ఏడాది సీజ‌న్ నిర‌వ‌ధికంగా వాయిదా ప‌డిన సంగ‌తి తెలిసిందే.Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *