అసోంలో విరిగిపడ్డ కొండచరియలు.. 20 మంది సజీవసమాధిఅసోంలో గత కొన్ని రోజులుగా ఏకధాటిగా కురుస్తున్న భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడి 20 మంది ప్రాణాలు కోల్పోయారు. మంగళవారం ఉదయం బరాక్ లోయ సమీపంలోని మూడు వేర్వేరు జిల్లాల్లో జరిగిన ఈ ప్రమాదాలలో 20 మంది చనిపోగా.. అనేక మంది గాయపడ్డారని అధికారులు తెలిపారు. వీరిలో ఆరుగురు ఒకే కుటుంబానికి చెందినవారు ఉన్నారు. ఈ ఘటనలో ఇప్పటి వరకూ తొమ్మిది మంది గాయపడినట్టు అధికారులు వెల్లడించారు. సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయని పేర్కొన్నారు. ఇళ్లలో నిద్రిస్తున్న సమయంలో కొండచరియలు విరిగిపడినట్టు వివరించారు. తొలుత బంగ్లాదేశ్ సరిహద్దుల్లోని కరీంగంజ్ జిల్లా కలియాగంజ్ ఏరియాలో కొండచరియలు విరిగిపడి ఆరు మృత్యువాత పడ్డారు. వీరిలో ఐదుగురు ఒకే కుటుంబానికి చెందినవారు.

Read Also:
రెండోది కచార్ జిల్లాలో లఖీపూర్‌లో జరిగిన ప్రమాదంలో ఏడుగురు చనిపోగా.. వీరిలో ముగ్గురు మహిళలు ఉన్నారు. ఈ ఘటన జోయ్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కోలాపూర్‌లో చోటుచేసుకుంది. హైలికండీ జిల్లా బతాత్‌బజ్ ప్రాంతంలో కొండచరియలు విరిగిపడి ఏడుగురు సజీవసమాధి అయ్యారు. వీరిలో ఆరుగురు ఒకే కుటుంబానికి చెందివారు కాగా.. నలుగురు చిన్నారులు ఉన్నారు. ఆయా ప్రాంతాల్లో ఎన్డీఆర్ఎఫ్, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటీన చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. శిథిలాలను తొలగించి, అందులో చిక్కుకున్నవారిని బయటకు తీస్తున్నారు.

Read Also:
భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడుతుండటంతో ఆ ప్రాంతాల్లోని ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఈ ఘటనపై అసోం ముఖ్యమంత్రి శర్వానంద్ సోనోవాల్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితుల కుటుంబాలను అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. బరాక్ లోయలో జరిగిన ఘటన తనను ఎంతగానో బాధించింది.. సహాయక, పునరావాస చర్యలను వేగవంతం చేయాలని కచార్, హైలాకందీ, కరీంగంజ్ జిల్లాల అధికార యంత్రాంగానికి, ఎస్డీఆర్ఎఫ్ దళాలను ఆదేశించాం.. వీలైనంత మేర అందరినీ అదుకోవాలని సూచించాం’ అని ట్వీట్ చేశారు.

Read Also:Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *