ఆగ‌స్టులో సౌతాఫ్రికాలో భార‌త్ ప‌ర్య‌ట‌న‌!క‌రోనా వైర‌స్ విస్త‌ర‌ణ కార‌ణంగా ప్ర‌పంచవ్యాప్తంగా క్రికెట్ కార్య‌క‌లాపాలు ఆగిపోయిన సంగతి తెలిసిందే. ఇప్పుడిప్పుడే వివిధ దేశాల్లో లాక్‌డౌన్‌ల‌కు స‌డ‌లింపులు ఇస్తుండ‌టంతోపాటు, క్రీడా కార్య‌క‌లాపాల‌ను అనుమ‌తిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో వ‌చ్చే ఆగ‌స్టులో త‌మ దేశంలో భార‌త్ ప‌ర్య‌టించాల‌ని సౌతాఫ్రికా కోరుకుంటోంది. మూడు టీ20ల సిరీస్ ఆడేందుకు క్రికెట్‌ సౌతాఫ్రికా ప్ర‌తిపాద‌న‌లు సిద్ధం చేస్తోంది. గ‌త రెండేళ్లుగా సౌతాఫ్రికాలో భార‌త్ ప‌ర్య‌టించ‌లేదు.

Must Read:
ఈ నేప‌థ్యంలో పొట్టిఫార్మాట్ సిరీస్ కోసం భార‌త్ త‌మ‌దేశంలో ప‌ర్య‌టించాల‌ని భావిస్తోంది. ఇప్పుడున్న షెడ్యూల్ ప్ర‌కారం శ్రీలంక‌తో మూడేసి మ్యాచ్‌లు చొప్పున టీ20, వన్డే సిరీస్ ఆడాల్సి ఉంది. అనంత‌రం జింబాబ్వే ప‌ర్య‌ట‌న‌, ఆసియాక‌ప్‌, స్వదేశంలో ఇంగ్లాండ్‌తో సిరీస్‌ల‌కు ఆతిథ్య‌మివ్వాల్సి ఉంది. ఈ నేప‌థ్యంలో సౌతాఫ్రికా సిరీస్‌కు ఓకే చెప్పేది అనుమానంగా మారింది.

Must Read:
మ‌రోవైపు కరోనా వైర‌స్ ఉనికిలోకి రావ‌డానికి ముందు భార‌త్‌-ద‌క్షిణాఫ్రికా జ‌ట్ల మ‌ధ్య మూడు వ‌న్డేల సిరీస్ జ‌ర‌గాల్సి ఉంది. ధ‌ర్మ‌శాల‌లో జ‌ర‌గాల్సిన తొలి వన్డే వ‌ర్షం కార‌ణంగా ర‌ద్ద‌వ్వగా.. క‌రోనా ఉనికితో రెండో వ‌న్డే నుంచే సిరీస్‌ను వాయిదా వేసింది. ఈ నేప‌థ్యంలో ఆ సిరీస్‌ను తిరిగి నిర్వ‌హించేందుకు బోర్డు ప్రణాళిక‌లు వేస్తోంది. క‌రోనా త‌ర్వాత జ‌రిగే తొలి టోర్నీ ఐపీఎల్ కానుంద‌ని తెలుస్తోంది. ఈ నేప‌థ్యంలో విదేశీ ఆట‌గాళ్లంద‌రూ తిరిగి వ‌చ్చే క్ర‌మంలో ప్రొటీస్ సిరీస్‌ను తిరిగి నిర్వ‌హించాల‌ని బీసీసీఐ భావిస్తోంది.Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *