ఆగ‌స్టు 11 నుంచి హైద‌రాబాద్ ఓపెన్‌.. బ్యాడ్మింట‌న్ టోర్నీల షెడ్యూల్ విడుద‌ల‌క‌రోనా వైర‌స్ కార‌ణంగా వాయిదా ప‌డిన క్రీడా కార్య‌క‌లాపాలు మెల్లిగా పుంజుకుంటున్నాయి. తాజాగా వ‌చ్చే ఆగ‌స్టు నుంచి అంత‌ర్జాతీయ బ్యాడ్మింట‌న్ పోటీలు ప్రారంభంకానున్నాయి. ఆ నెల 11 నుంచి హైద‌రాబాద్ ఓపెన్ స్టార్ట్ కానుంది. క‌రోనా త‌ర్వాత ప్రారంభ‌మ‌య్యే మొట్ట‌మొద‌టి అంత‌ర్జాతీయ బ్యాడ్మింట‌న్ టోర్నీ ఇదే కావ‌డం విశేషం. చివ‌రిసారిగా మార్చి 15న ప్ర‌తిష్టాత్మ‌క ఆల్ ఇంగ్లాండ్ చాంపియ‌న్‌షిప్ జ‌రిగింది. అనంత‌రం క‌రోనా కార‌ణంగా అన్నీ టోర్నీలు నిర‌వ‌ధికంగా వాయిదా ప‌డ్డాయి.

Must Read:
తాజాగా ప్ర‌పంచ బ్యాడ్మింట‌న్ స‌మాఖ్య (బీడబ్ల్యూఎఫ్‌) అంత‌ర్జాతీయ క్యాలెండ‌ర్‌ను విడుద‌ల చేసింది. ఈసారి నాలుగు టోర్నీల‌ను ర‌ద్దు చేసింది. అలాగే ఆసియా బ్యాడ్మింట‌న్ చాంపియ‌న్‌షిప్‌ను వాయిదా వేసింది. అనుబంధ సంఘాల‌తో క‌లిసి చ‌ర్చించిన త‌ర్వాతే తాము షెడ్యూల్ రూపొందించామ‌ని బీడ‌బ్ల్యూఎఫ్ తెలిపింది. అలాగే ఈ ఏడాది భార‌త గ‌డ్డ‌పై స‌య్య‌ద్ మోడీ ఇంట‌ర్నేష‌నల్ టోర్నీని న‌వంబ‌ర్‌లో, ఇండియా ఓపెన్ టోర్నీని డిసెంబ‌ర్‌ల నిర్వ‌హించ‌నున్నారు. సీజ‌న్ ఆఖ‌రి టోర్నీ బీడ‌బ్ల్యూఎఫ్ వ‌రల్డ్ టూర్ ఫైనల్స్ టోర్నీని డిసెంబ‌ర్ మూడో వారంలో చైనాలో నిర్వ‌హించ‌నున్నారు.Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *