ఆసియాకప్ నిర్వ‌హ‌ణ‌పై సందిగ్ధం!



కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తుండ‌టంతో అనేక క్రీడా టోర్నీలు వాయిదా పడిన సంగతి తెలిసిందే. ప్రతిష్టాత్మక ఇండియన్ ప్రీమియర్ లీగ్, ఒలింపిక్స్‌ ఇప్పటికే వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రతిష్టాత్మక ఆసియాక‌ప్‌ కూడా వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. నిజానికి ఈ ఏడాది ఆసియాక‌ప్ పాక్‌లో జరగాల్సి ఉంది. అయితే భద్రతా కారణాల రీత్యా పాకిస్తాన్‌లో పర్యటించలేమ‌ని, భారత జట్టు తెలపడంతో టోర్నీని వేరే చోటుకు తరలించేందుకు దాయాది అంగీకరించింది. ఈ నేపథ్యంలో ఆసియా క్రికెట్ కౌన్సిల్ సమావేశమై టోర్నీకి సంబంధించిన వేదికను ఖరారు చేయనుంది. అయితే వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఈ సమావేశం నిరవధికంగా వాయిదా పడింది.

Read Also:
ఇక వైరస్ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ కార్యకలాపాలు అన్నీ వాయిదా పడిన సంగతి తెలిసిందే. క‌రోనా హంగామా సద్దుమణిగాక ప్రపంచ వ్యాప్తంగా ఆయా దేశాల ద్వైపాక్షిక సిరీస్‌ల‌ను ఆడేందుకు మొగ్గు చూపుతాయి. దీంతో తమకు వచ్చే నష్టాన్ని భర్తీ చేసుకునేందుకు చూస్తాయి తప్ప ఆసియాక‌ప్ ఆడే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆసియాక‌ప్ ఈ ఏడాది జరిగే అవకాశం అనుమానమేనని విశ్లేషకులు భావిస్తున్నారు.

Read Also:
మరోవైపు ఈ ఏడాది టీ20 ప్రపంచకప్ ఉండడంతో ఆసియా కప్‌ను టీ20 ఫార్మాట్లో నిర్వహించాలని ఆర్గ‌నైజ‌ర్లు భావించారు. 2016లోనూ మెగా టోర్నీని దృష్టిలో పెట్టుకుని, పొట్టి ఫార్మాట్లోనే టోర్నీని జరిపారు. అనంతరం 2018 లో 50 ఓవ‌ర్ల‌ ఫార్మాట్లో ఆసియా క‌ప్పును నిర్వహించారు. ఈ రెండు సార్లు బంగ్లాదేశ్ ఓడించిన‌ భారత జట్టు విజేతగా నిలిచింది. దీంతో ఈ ఏడాది టోర్నీలో డిఫెండింగ్ చాంపియన్‌గా ఇండియా బరిలోకి దిగనుంది. ఏదేమైనా క‌రోనా వేడి చ‌ల్లారాక‌.. ఆసియాక‌ప్‌తోపాటు వివిధ దేశాలకు చెందిన క్రికెట్ టోర్నీల‌పై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *