ఆ హీరోయిన్‌తో బ‌యోపిక్‌లో న‌టించేందుకు సిద్ధం: కోహ్లీభార‌త కెప్టెన్ త‌న‌పై రూపొందించే బ‌యోపిక్‌లో లీడ్ రోల్‌ను పోషించేందుకు సిద్ధ‌మ‌ని తాజాగా ప్ర‌క‌టించాడు. భార‌త స్టార్ ఫుట్‌బాలర్ సునీల్ చెత్రీతో సోష‌ల్ మీడియాలో మాట్లాడిన కోహ్లీ.. ప‌లు విష‌యాల‌ను పంచుకున్నాడు. త‌నపై రూపొందించే బ‌యోపిక్‌లో అనుష్క శ‌ర్మ హీరోయిన్ అయితేనే న‌టించేందుకు సిద్ధ‌మ‌ని వ్యాఖ్యానించాడు. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క.. కోహ్లీ భార్య అన్న సంగ‌తి తెలిసిందే. మూడేళ్ల కింద‌ట ఇట‌లీలో డెస్టినేష‌న్ వెడ్డింగ్ రూపంలో వీళ్లిద్ద‌రూ వివాహం చేసుకున్నారు. అప్ప‌టి నుంచి ఎంతో అన్యోన్యంగా ఈ జంట‌ ఉంటోంది.

Must Read:
అనుష్క జీవితంలోకి ప్ర‌వేశించాక.. త‌న దృక్ఫ‌థం ఎంతో మారిందని తాజాగా కోహ్లీ వ్యాఖ్యానించాడు. అప్ప‌టికీ సెల్ఫ్ సెంట‌ర్‌గా ఆలోచిస్తూ, కంఫ‌ర్ట్‌జోన్‌లో ఉన్న తాను.. అనుష్కతో మాట్లాడ‌టం వల్ల త‌న ఆలోచ‌న‌ తీరు మారిందని కోహ్లీ చెప్పుకొచ్చాడు. అప్ప‌టివ‌ర‌కు వ్య‌క్తిగ‌తంగా మాత్రమే ఎక్కువ‌గా ఆలోచించిన తాను.. అనుష్క స‌హ‌చ‌ర్యంతో ఎంతో మార్పు వ‌చ్చింద‌ని పేర్కొన్నాడు.

Must Read:
మ‌రోవైపు బాలీవుడ్‌లో స్పోర్ట్స్ స్టార్ బ‌యోపిక్‌లు ఇప్ప‌టివర‌కు చాలా నిర్మిత‌మైన సంగ‌తి తెలిసిందే. ఎంఎస్ ధోనీ, మేరీ కోమ్‌, బాగ్ మిల్కా బాగ్, అజహ‌ర్, స‌చిన్ టెండూల్క‌ర్‌ త‌దిత‌ర బ‌యోపిక్‌లు రూపొందించారు. 1983 వ‌ర‌ల్డ్‌క‌ప్ విజ‌యంపై 83 అనే సినిమాను రూపొందిస్తున్న సంగ‌తి తెలిసిందే.Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *