ఇంట్లో కూర్చొని ఖాళీ టైమ్‌లో ఇలా నెలకు రూ.10,000కు పైగా సంపాదించండి!డబ్బు సంపాదించాలని భావిస్తున్నారా? అయితే మీకు శుభవార్త. ఇంట్లో కూర్చొని కూడా ఆదాయం పొందొచ్చు. దీని కోసం పెద్దగా కష్టపడాల్సిన అవసరం కూడా లేదు. ప్రస్తుతం కరోనా వైరస్ వల్ల నెలకొన్ని లాక్ డౌన్ పరిస్థితుల్లో చాలా మందికి ఇది మంచి ఆదాయ వనరుగా మారొచ్చు.

ఇంట్లో కూర్చొని డబ్బు ఎలా సంపాదించాలో చూద్దాం. సాధారణంగా ఈమెయిల్స్ గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. మనకు కూడా చాలా మెయిల్స్ వస్తూ ఉంటాయి. అయితే మనం అన్ని మెయిల్స్‌ను ఓపెన్ చేయం. అయితే ఇక్కడ ఈమెయిల్స్ చదవడం వల్ల కూడా డబ్బులు సంపాదించొచ్చు. దీని కోసం మీకు ఇంటర్నెట్ ఉంటే సరిపోతుంది.

Also Read:

భారత్‌లో ఈమెయిల్ మార్కెట్ చాలా వేగంగా విస్తరిస్తూ వస్తోంది. ఇంటి వద్ద నుంచే పని చేసి డబ్బు సంపాదించాలని భావించే వారికి మాత్రం ఈమెయిల్ మార్కెట్ మంచి ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. ఈమెయిల్‌ను ఓపెన్ చేసి చదవడం వల్ల డబ్బు పొందొచ్చు. అంతర్జాతీయంగా చాలా వెబ్‌సైట్లు ఇలాంటి ఆఫర్లు అందిస్తున్నాయి. ఇవి ఈమెయిల్ సర్వేలు నిర్వహిస్తూ ఉంటాయి. వీటిల్లో పాల్గొన్న వారికి మంచి రాబడి కూడా వస్తుంది.

Also Read:

దీని కోసం మీరు రెగ్యులర్‌గా పనిచేయాల్సిన అవసరం లేదు. మీకు ఎప్పుడు డబ్బు అవసరం అనుకుంటే అప్పుడు పని చేసి ఆదాయం పొందొచ్చు. ఈమెయిల్స్ రీడింగ్ ద్వారా డబ్బు ఎలా పొందాలని, ఎవ్వరు ఇలాంటి ఆఫర్ అందిస్తారు అని అనుకుంటున్నారా? దీని కోసం పలు వెబ్‌సైట్లు ఉన్నాయి. వాటిల్లో ఇప్పుడు కొన్నింటిని చెప్పుకుంద్దాం.

Also Read:

మనీమెయిల్.ఇన్ అనే వెబ్‌సైట్ ఒకటి ఒక ఈమెయిల్ ఓపెన్ చేసి చదివితే రూ.0.2 నుంచి రూ.20 వరకు అందిస్తోంది. దీని కోసం మీరు వెబ్‌సైట్‌లో ముందుగా అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. దీని ద్వారా లాగిన్ అవ్వాలి. ఇలా రెగ్యులర్‌గా మెయిల్స్ చదివితే నెలకు సులభంగానే రూ.10,000 సంపాదించొచ్చు.

ఇంకా పైసాలైవ్.కామ్ అనే సైట్ కూడా ఇలాంటి సదుపాయాన్ని కల్పిస్తోంది. ఇక్కడ ఈ వెబ్‌సైట్‌ను మీరు మీ స్నేహితులకు రిఫర్ చేయడం వల్ల కూడా డబ్బులు పొందొచ్చు. మ్యాట్రిక్స్‌మెయిల్స్.కామ్, క్యాష్‌4ఆఫర్స్.కామ్, సెండ్‌ఎర్నింగ్స్.కామ్ వంటి వెబ్‌సైట్లు కూడా ఇలాంటి సేవలు అందిస్తున్నాయి.Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *