ఇషాంత్ దృష్టిలో బెస్ట్ కోచ్ ఎవ‌రంటే..?ప్ర‌స్తుత‌మున్న టీమిండియాలో అత్యంత సీనియ‌ర్ ప్లేయ‌ర్ ఇషాంత్ శ‌ర్మ అన‌డంలో ఎలాంటి సందేహం లేదు. 2007లో అరంగేట్రం చేసిన ఇషాంత్ శ‌ర్మ‌.. త‌న 13 ఏళ్ల కెరీర్‌లో 97 టెస్టులు, 80 వ‌న్డేలు, 18 టీ20లు ఆడాడు. ఇన్నాళ్ల కెరీర్‌లో ఎంతోమంది కోచ్‌ల ఆధ్వ‌ర్యంలో ఇషాంత్ పనిచేశాడు. తాజాగా సోష‌ల్ మీడియాలో మాట్లాడుతూ.. త‌న దృష్టిలో బెస్ట్ కోచ్ ఎవ‌ర‌నేదానిపై ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు. ఇషాంత్‌ను ఆక‌ట్టుకున్న ఆ కోచ్ ఎవ‌రంటే.. ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ కావ‌డం విశేషం.

Must Read:
గ‌తేడాది ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ సందర్భంగా పాంటింగ్‌తో క‌లిసి ప‌నిచేసే అవ‌కాశం ల‌భించింద‌ని ఇషాంత్ పేర్కొన్నాడు. అప్పుడు త‌న‌లో పాంటింగ్ ఎంత‌గానో స్ఫూర్తినింపాడ‌ని అభిప్రాయ‌ప‌డ్డాడు. నిజానికి కొంత విరామం త‌ర్వాత గతేడాది ఢిల్లీ క్యాపిట‌ల్స్ త‌ర‌పున ఇషాంత్ ఐపీఎల్లోకి పున‌రాగమ‌నం చేశాడు. ఆ స‌మ‌యంలో త‌ను ఎంతో నెర్వ‌స్‌గా భావించిన‌ట్లు ఇషాంత్ తెలిపాడు.

Must Read:
ఈ స‌మ‌యంలో పాంటింగ్ ద‌గ్గ‌రికి వ‌చ్చి, త‌న‌లో ఎంతో ధైర్యం నింపాడ‌ని ఇషాంత్ గుర్తు తెచ్చుకున్నాడు. తానో సీనియ‌ర్ బౌల‌ర్‌న‌ని, యువ ఆట‌గాళ్ల‌కు మార్గ‌ద‌ర్శ‌నం చేయాల్సిన అవ‌స‌ర‌ముంద‌ని వ్యాఖ్యానించాడు. దీంతో ఆ టోర్నీలో త‌ను స్ఫూర్తిని పొందాన‌ని తెలిపాడు. ఆ సీజ‌న్‌లో ఢిల్లీ విజ‌యాల్లో ఇషాంత్ కీల‌క‌పాత్ర పోషించాడు. 13 వికెట్ల‌తో లీడింగ్ వికెట్ టేక‌ర్ల‌లో ఒక‌రిగా నిలిచాడు. ప్ర‌స్తుతం ఇషాంత్ టెస్టు జ‌ట్టుకే ప‌రిమిత‌మ‌య్యాడు. 2016లో చివ‌రి వ‌న్డే, 2013 చివ‌రి టీ20ను ఇషాంత్ ఆడాడు.Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *