ఈజీగా తయారయ్యే దహి వడ.. ఎంతో టేస్టీగా ఉంటుంది..



మీరు ఎన్నో రకాల దహి వడలు తినే వుంటారు, కానీ ఎప్పుడైనా బ్రెడ్ దహి రుచి ఎలా ఉంటుందో తిని చూసారా ? వినటానికి చాలా బాగుంది కదా? మీరు తక్కువ పదార్దాలతో దీనిని మీ ఇంట్లోనే చాలా సులువుగా తయారు చేసుకోవచ్చు. బ్రెడ్ దహి వడను ఇంట్లోనే ఎలా వెంటనే తయారుచేసుకోవాలో ఇక్కడ చూద్దాం.

మీరు ఎన్నో రకాల దహి వడలు తినివుంటారు. కానీ, ఎప్పుడైనా బ్రెడ్ దహి వడ రుచి ఎలా ఉంటుందో తిని చూసారా ? వినటానికి చాలా బాగుంది కదా? మీరు తక్కువ పదార్దాలతో దీనిని మీ ఇంట్లోనే చాలా సులువుగా తయారు చేసుకోవచ్చు. బ్రెడ్ దహి వడకి తక్కువ పాపులారిటీ ఉన్నపటికీ బ్రెడ్ దహి వడ ఎంతో టేస్టీగా ఉండే పెరుగుతో మిమ్మల్ని ఫ్యాన్స్‌ని చేసుకుంటుంది. కాబట్టి..ఇంకా ఎదురు చూడటం ఎందుకు? బ్రెడ్ దహి వడను ఇంట్లోనే ఎంత త్వరగా తయారుచేసుకోవాలో ఇక్కడ చూద్దాం.

కావలసిన పదార్థాలు -సెర్వ్స్ 2

  • 4 బ్రెడ్ స్లైసెస్
  • 3 / 4 కప్పు నీళ్లు
  • కొత్తిమీర చట్నీ
  • తరిగిన పచ్చిమిరపకాయలు
  • చింతపండు చట్నీ
  • 1 టీ స్పూన్ పంచదార
  • వేయుంచుకున్న జీలకర్ర పొడి 1 టీ స్పూన్
  • కారం
  • ఉప్పు
  • 1 / 2 అమ్చుర్ పౌడర్
  • ఎండుద్రాక్ష
  • మజ్జిగ
  • కొత్తిమీర
  • 2 ఉడికించిన బంగాళాదుంపలు
  • నల్ల ఉప్పు

తయారీ విధానం..

స్టెప్ 1 బ్రెడ్ స్లైసెస్ ని తీసుకుని అంచులను కట్ చేసి పక్కన పెట్టుకోండి.

స్టెప్ 2 ఒక గిన్నె తీసుకోని దానిలో బంగాళదుంపలను మాష్ (మెదిపి) చేయండి, పచ్చిమిరపకాయలు, అమ్చూర్ పౌడర్, ఎండుద్రాక్ష, వేయుంచుకున్న జీలకర్ర పొడి మరియు ఉప్పు వేసి అన్నిటికి బాగా కలిపి ఒక పక్కన ఉంచుకోండి. పెరుగులో పంచదారను బాగా కలపి పెట్టుకోండి.

స్టెప్ 3 బ్రెడ్ స్లైసెస్ ని మజ్జిగలో కొంచెం తడిపి పెట్టుకొని అంతక ముందు చేసుకున్న మసాలా ను ఉండలుగా చేసి బ్రెడ్ మీద పెట్టి బాల్ లాగా రోల్ చేసుకోండి.

స్టెప్ 4 ఫ్రై చేసుకునే పాన్ ని వాడండి అందులో కొంచెం నెయ్యిని వేసుకోండి. నెయ్యి వేడెక్కిన తరువాత దానిలో బంగాళాదుంపలు ఫిల్లింగ్ కనిపించే వైపుగా బ్రెడ్ వడని వేసుకోండి. దీనిని మెల్లిగా వేయించడం ఏంతో ముఖ్యమైనది ఇది ఫిల్లింగ్ ని బయటకు రానివ్వొద్దు. రెండు వైపులా మీడియం మంటపై వేయించండి.

స్టెప్ 5 బ్రెడ్ వడలను ప్లేట్ లోకి తీసుకోని దానిపై తీయటి పెరుగు, చింతపండు చట్నీ, కొత్తిమీర చట్నీ, వేయించిన జీలకర్ర పొడి, కారం వేసుకున్న తరువాత మళ్లి కొద్దిగా పెరుగు, నల్ల ఉప్పు, కొత్తిమీర వేసి బాగా సర్వ్ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *