ఈ సంక్షోభంలో ఐసీసీని గంగూలీనే న‌డిపించాలి: స‌్మిత్‌క‌రోనా వైర‌స్ కార‌ణంగా ప్ర‌పంచ‌వ్యాప్తంగా క్రీడా కార్య‌క‌లాపాలకు బ్రేక్ ప‌డిన సంగ‌తి తెలిసిందే. ఇప్పుడిప్పుడే క‌రోనా నుంచి కోలుకుంటున్న ఈ సంక్షోభం స‌మ‌యంలో అంత‌ర్జాతీయ క్రికెట్ మండ‌లి ()నీ లీడ్ చేసేందుకు స‌మ‌ర్థులు కావాల‌ని సౌతాఫ్రికా మాజీ కెప్టెన్, క్రికెట్ సౌతాఫ్రికా డైరెక్టర్ గ్రేమ్ స్మిత్ అభిప్రాయ‌ప‌డ్డాడు. భార‌త మాజీ కెప్టెన్, బీసీసీఐ అధ్య‌క్షుడు సౌర‌వ్ గంగూలీలో అందుకు కరెక్ట్ అయినవాడ‌ని వ్యాఖ్యానించాడు. భార‌త బోర్డును అద్భుతంగా గంగూలీ న‌డిపిస్తున్న సంగ‌తి తెలిసిందే.

Must Read:
క‌రోనా సంక్షోభ స‌మ‌యంలో ఐసీసీ న‌డ‌పాలంటే ఆధునిక క్రికెట్‌తో ప‌రిచ‌య‌ముండ‌టంతోపాటు మంచి నాయ‌క‌త్వ ల‌క్ష‌ణాలున్న గంగూలీ అయితే స‌రిగ్గా స‌రిపోతాడని స్మిత్ వ్యాఖ్యానించాడు. ఐసీసీ ప్ర‌స్తుత చైర్మ‌న్ శ‌శాంక్ మనోహ‌ర్ కూడా భార‌తీయుడే కావ‌డం విశేషం. అయితే మే నెల త‌ర్వాత త‌న ప‌ద‌వీకాలం ముగిసిపోనుండ‌టంతో, తిరిగి ఎక్స్‌టెన్ష‌న్ కోర‌బోన‌ని గ‌తంలోనే మ‌నోహ‌ర్ తెలిపారు.

Must Read:
ఈ నేప‌థ్యంలో ఐసీసీ హెడ్ ప‌ద‌విలోకి గంగూలీ అయితే బాగుంటుంద‌ని స్మిత్ వ్యాఖ్యానించిన‌ట్లు తెలుస్తోంది. మ‌రోవైపు వెస్టిండీస్‌లో జూలైలో త‌మ జ‌ట్టు జ‌ర‌ప‌బోయే ప‌ర్య‌ట‌న మ‌రింత ఆల‌స్యమ‌య్యే అవ‌కాశాలున్నాయ‌ని స్మిత్ తెలిపాడు. క‌రోనా వైర‌స్ కార‌ణంగా చాలా ద్వైపాక్షిక సిరీస్‌లపై ప‌డ‌టంతో ఈ ఆల‌స్యానికి కార‌ణ‌మ‌ని వ్యాఖ్యానించాడు. మ‌రోవైపు ఐసీసీని న‌డిపంచే సామ‌ర్థ్యం గంగూలీకి ఉంద‌ని గ‌తంలో ఇంగ్లాండ్ లెజెండ్ డేవిడ్ గోవ‌ర్ వ్యాఖ్యానించిన సంగ‌తి తెలిసిందే.Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *