ఉద్యోగం పోయినా EMI కట్టొచ్చు.. ఇలా చేస్తే భయపడాల్సిన అవసరం లేదు!కరోనా వైరస్ కారణంగా చాలా మంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉద్యోగాలు పోతాయేమోనని ప్రైవేట్ సంస్థల్లో పనిచేస్తున్న వారు చాలా భయపడుతున్నారు. చాలా వరకు బిజినెస్‌లు ఇంకా ప్రారంభం కాలేదు. ఒకవేళ బిజినెస్‌లు స్టార్ట్ అయినా కూడా సాధారణ స్థితికి రావడానికి కొన్ని నెలలు పట్టొచ్చు. మీరు కూడా మీ ఉద్యోగం పోవచ్చని భయపడుతూ ఉంటే.. మీకు ఒక ఒక ఆప్షన్ అందుబాటులో ఉంది.

జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీలు ఇప్పుడు జాబ్ లాస్ ఇన్సూరెన్స్ కవర్‌ను అందిస్తున్నాయి. ఇవి స్టాండలోన్ ప్లాన్ల రూపంలో అందుబాటులో లేవు. అంటే నేరుగా ఈ పాలసీలను కొనుగోలు చేయడం కుదరదు. యాడ్ ఆన్ కవర్స్ రూపంలో ఈ పాలసీలు తీసుకోవాలి. యాక్సిడెంట్ అండ్ క్రిటికల్ ఇల్‌నెస్ లేదా హోమ్ లోన్ వంటి ఇన్సూరెన్స్ పాలసీతో వీటిని తీసుకోవచ్చు. పెద్ద మొత్తంలో పర్సనల్ లోన్ తీసుకున్నప్పుడు కూడా ఈ పాలసీ అందుబాటులో ఉండొచ్చు.

Also Read:

ఈ పాలసీ తీసుకున్న తర్వాత ఉద్యోగం పోతే అప్పుడు లోన్ ఈఎంఐ కొన్ని నెలలపాటు ఈ ఇన్సూరెన్స్ కంపెనీలే చెల్లిస్తాయి. ప్రస్తుతం కేవలం ఒకే ఒక్క పాలసీ స్టాండలోన్ రూపంలో అందుబాటులో ఉంది. అది రాజీవ్ గాంధీ శ్రామిక్ కల్యాణ్ యోజన. ఈఎస్ఐసీ ఈ పాలసీ‌ని అందిస్తోంది. ఇది అన్‌ఎంప్లాయ్‌మెంట్ ఇన్సూరెన్స్ కవర్.

Also Read:

జాబ్ లాస్ ఇన్సూరెన్స్ కవర్ తీసుకుంటే.. మీరు ఉద్యోగం కోల్పోయినప్పుడు ఇన్సూరెన్స్ సంస్థ 3 పెద్ద ఈఎంఐలను చెల్లిస్తుంది. పాలసీ తీసుకున్న తర్వాత కేవలం ఒక్కసారి మాత్రమే ఈ బెనిఫిట్ లభిస్తుంది. పాలసీ వెయిటింగ్ పీరియడ్ 1 – 3 నెలల వరకు ఉండొచ్చు.

ఇక ఈ తరహా ఇన్సూరెన్స్ క్లెయిమ్ పొందాలంటే మీరు కోల్పోయినట్లు ప్రూఫ్ ఉండాలి. అంటే టర్మినేషన్ లెటర్ కావాలి. అలాగే మీరు ఇన్సూరెన్స్ కంపెనీకి ఉద్యోగం పోయిందని లిఖిత పూర్వకంగా రాసి ఇవ్వాలి. అలాగే అవసరమైన డాక్యుమెంట్లు అందించాల్సి ఉంటుంది. వాలంటరీ రిసిగ్నేషన్‌కు పాలసీ కవరేజ్ వర్తించదు.Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *