ఐపీఎల్ మజాకి 12 ఏళ్లు.. బంగారు బాతుక్రికెట్ ప్రపంచానికి సిసలైన టీ20 మజాని పరిచయం చేసిన టోర్నీగా చరిత్రలో నిలిచిపోయింది. సరిగ్గా 12 ఏళ్ల క్రితం బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా ఆరంభమైన ఐపీఎల్.. భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)‌కి కాసుల వర్షం కురిపించింది. ఎంతలా అంటే..? అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ)ని సైతం శాసించే స్థాయికి బీసీసీఐ ఆర్థికంగా ఎదిగింది. కానీ.. 2008 నుంచి సక్సెస్‌ఫుల్‌ సాగిన ఐపీఎల్‌కి ఈ ఏడాది కరోనా వైరస్ కారణంగా తాత్కాలికంగా బ్రేక్ పడింది.

Read More:

2008, ఏప్రిల్ 18న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కోల్‌కతా నైట్‌రైడర్స్ మధ్య జరిగిన మ్యాచ్‌తో ఐపీఎల్ ప్రారంభమైంది. ఆ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టు.. హిట్టర్ బ్రెండన్ మెక్‌కలమ్ (158 నాటౌట్: 73 బంతుల్లో 10×4, 13×6) జోరుతో నిర్ణీత 20 ఓవర్లలోనే ఏకంగా 222 పరుగులు చేసింది. అభిమానులకి అసలైన టీ20 మజా పరిచయం అయ్యింది ఇక్కడే..! అని ఇప్పటికీ చెప్పుకుంటూ ఉంటారు. అయితే.. లక్ష్యఛేదనలో బెంగళూరు టీమ్ 15.1 ఓవర్లలోనే 82 పరుగులకి కుప్పకూలిపోయింది. 11వ స్థానంలో బ్యాటింగ్‌కి వచ్చిన విరాట్ కోహ్లీ ఒక్క పరుగుకే ఔటైపోయాడు.

Read More:ఈ 12 ఏళ్లలో ఐపీఎల్‌ ఒక్కసారి కూడా వాయిదాపడటం లేదా రద్దవడం జరగలేదు. 2009లో సార్వత్రిక ఎన్నికల కారణంగా దక్షిణాఫ్రికాలో ఆ ఏడాది ఐపీఎల్ జరగగా.. 2014లో యూఏఈ వేదికగా ఫస్ట్ హాఫ్ సీజన్ మ్యాచ్‌లు జరిగాయి. కానీ.. ఈ ఏడాది కరోనా వైరస్ కారణంగా మార్చి 29 నుంచి ప్రారంభంకావాల్సిన ఐపీఎల్ సీజన్‌ని తొలుత ఏప్రిల్ 15కి వాయిదా వేసిన బీసీసీఐ.. దేశంలో లాక్‌డౌన్‌ని మే 3 వరకూ పొడిగించడంతో ఇప్పుడు నిరవధికంగా వాయిదా వేసేసింది. ఒకవేళ ఐపీఎల్ 2020 సీజన్ రద్దయితే.. బీసీసీఐ సుమారు రూ.3869.5 కోట్లు నష్టపోనుందని ఓ అంచనాSource link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *