కరోనా తర్వాత వచ్చే సంచలన మార్పులేంటి? కేటీఆర్ చెప్పిన 3 అంశాలు



భారత దేశంలో కరోనా కట్టడికి ఇక్కడి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై అంతర్జాతీయ సమాజం నుంచి ప్రశంసలు వస్తున్న సంగతి తెలిసిందే. దేశీయంగా కూడా ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం కొవిడ్-19ను సమర్థంగానే ఎదుర్కొంటోందని ఎక్కువ మంది ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ఓ సర్వే ప్రకారం ఇది వెల్లడైంది. ఇదిలా ఉంటే.. ప్రస్తుత కరోనా వైరస్ ఆందోళన పూర్తిగా సమసిపోయాక ప్రపంచం ఎలా ఉండబోతోంది. ముఖ్యంగా భారత దేశంలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి.. అనే అంశం ఆసక్తికరంగా మారింది. దీనిపై పలువురు నిపుణులు తమ అభిప్రాయాలను ఇంతకుముందే వెల్లడించారు. కరోనా వ్యవహారం ముగిశాక అప్పటికే జరిగిన నష్టాన్ని రెట్టింపు వేగంతో పూడ్చుకోగలిగే సత్తా అలవడుతుందని మరికొందరు అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో ‘కరోనా తర్వాత భారత్’ అనే అంశంపై ది న్యూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్ వార్తా సంస్థ ఓ కార్యక్రమం నిర్వహించింది. ఇందులో తెలంగాణ నుంచి మంత్రి కేటీఆర్ ఫోన్ ద్వారా పాల్గొన్నారు. ‘కరోనా తర్వాత భారత్ ఎలా ఉండబోతుందనే అంశంపై ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *