కరోనా పేషెంట్ల అంబులెన్స్ బోల్తా.. గుంటూరులో ప్రమాదంకరోనా పేషెంట్లను తీసుకెళ్తున్న 108 కొట్టిన ఘటన జిల్లాలో జరిగింది. గుంటూరు నుంచి మంగళగిరి సమీపంలో ఏర్పాటు చేసిన కోవిడ్ ప్రత్యేక ఆసుపత్రికి కరోనా పేషెంట్లను తరలిస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. గుంటూరు నుంచి మంగళగిరి వైపు బయల్దేరిన అంబులెన్స్‌ను పెదకాకాని గ్రామ సమీపంలో లారీ ఢీకొట్టడంతో బోల్తా కొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు కోవిడ్ పాజిటివ్ రోగులకు గాయాలైనట్లు సమాచారం.

గుంటూరు జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకీ పెరుగుతున్నాయి. కరోనా రోగులకు చికిత్స అందించేందుకు మంగళగిరి సమీపంలోని ఎన్నారై ఆస్పత్రిని కోవిడ్ – 19 ప్రత్యేక ఆసుపత్రిగా మార్చారు. జిల్లాలోని పాజిటివ్ కేసులను ఎన్నారై ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అందులో భాగంగా ఇద్దరు పాజిటివ్ రోగులను ఆసుపత్రికి తీసుకెళ్తుండగా అంబులెన్స్ ప్రమాదానికి గురైంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Also Read:Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *