కష్టాల్లో పాకిస్థాన్.. ఇమ్రాన్ ఖాన్ ప్లాన్ ఇదే!దాయాది దేశం పాకిస్థాన్ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. కరోనా వైరస్ కారణంగా తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో సతమతమౌతోంది. ఈ నేపథ్యంలో పరిస్థితులను చక్కబెట్టేందుకు పాక్ ప్రభుత్వం భారీగా రుణాలు తీసుకోవాలని యోచిస్తోంది. అంతర్జాతీయ ఆర్థిక సంస్థల నుంచి ఏకంగా 2 బిలియన్ డాలర్ల రుణాలను (దాదాపు రూ.15 వేల కోట్లు) పొందాలని ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది.

పాక్ ఖజానా ఖాళీ అవుతోంది. మరోవైపు కోవిడ్ 19 శరవేగంగా విస్తరిస్తూ వస్తోంది. కరోనాను ఎదుర్కోవాలంటే నిధులు కావాలి. అందుకే పాక్ గవర్నమెంట్ ఈ మేరకు రుణాలు తీసుకోవాలని భావిస్తోంది. పలు నివేదికలు ఈ విషయాన్ని వెల్లడిస్తున్నాయి. పాకిస్తాన్ ఇప్పటికే ప్రపంచ బ్యాంక్, ఏసియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్‌ను 2 బిలియన్ డాలర్ల రుణం అందించాలని కోరినట్లు తెలుస్తోంది.

Also Read:

పాకిస్థాన్ గతంలో జీ20 దేశాల నుంచి తీసుకున్న 1.8 బిలియన్ డాలర్ల కన్నా తాజా ప్రతిపాదిక రుణ మొత్తం ఇంకా ఎక్కువ కావడం గమనార్హం. పాకిస్థాన్ ఇప్పటికే ఏడీబీతో కోవిడ్ 19 ఎమర్జెన్సీ లోన్‌కు సంబంధించి డీల్ కుదుర్చుకుంది. వైద్య ఉపకరణాలు కొనుగోలు చేయడానికి ఈ డబ్బులు వినియోగించనుంది. ఇప్పుడు ఏడీబీ పాకిస్థాన్‌కు అందించే రుణ మొత్తాన్ని మరింత పెంచే ఛాన్స్ ఉంది.

Also Read:

ఇకపోతే పాక్ ప్రభుత్వం ఎమర్జెన్సీ లోన్ కింద ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ నుంచి 1.39 బిలియన్ డాలర్ల రుణాన్ని తీసుకుంది. వరల్డ్ బ్యాంక్ నుంచి 200 మిలియన్ డాలర్ల ఆర్థిక సాయం పొందింది. జూన్ నాటికి పాకిస్తాన్ జీడీపీలలో దేశ రుణ భారం ఏకంగా 90 శాతానికి చేరొచ్చనే అంచనాలున్నాయి.

కాగా పాకిస్థాన్‌లో కూడా కరోనా వైరస్ శరవేగంగా విస్తరిస్తూనే వస్తోంది. ఇప్పటికే ఆ దేశంలో కోవిడ్ 19 కేసులు 45 వేల పైకి చేరాయి. 985 మంది కరోనా కారణంగా మరణించారు. ఇక మన దేశంలో కరోనా కేసులు 1.1 లక్షలకు పైన చేరాయి. ఇక అంతర్జాతీయంగా కోవిడ్ 19 సోకిన వారి సంఖ్య 50 లక్షలకు పైకే చేరింది.Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *