కోహ్లీకి కొత్త స‌వాలు విసిరిన ఇంగ్లాండ్ లెజెండ్క‌రోనా వైర‌స్ కార‌ణంగా అనుకోకుండా విశ్రాంతి ల‌భించ‌డంతో క్రికెట‌ర్లు అంతా త‌మ ఫ్యామిలీతో గ‌డుపుతున్న సంగ‌తి తెలిసిందే. అలాగే అభిమానుల‌తో ట‌చ్‌లో ఉండేందుకుగాను సోష‌ల్ మీడియాలో అందుబాటులో ఉంటున్నారు. తాజాగా భార‌త కెప్టెన్ విరాట్ కోహ్లీ త్రో బ్యాక్ పిక్చ‌ర్ అంటూ ఒక పిక్‌ను సోష‌ల్ మీడియా వేదిక ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశాడు. అందులో కోహ్లీ సూప‌ర్ స్టైలిష్‌గా ఉన్నాడు. అయితే వెంట‌నే లైన్లోకి వచ్చిన ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ కెవిన్ పీట‌ర్స‌న్ త‌న‌దైనశైలిలో కామెంట్ విసిరాడు.

Must Read:

క్లీన్ షేవ్ చేసుకోవాల‌ని కోహ్లీకి పీట‌ర్స‌న్ స‌వాల్ విసిరాడు. క్లీన్ షేవ్‌తో ఉన్న త‌న ఫొటోను పోస్టు చేశాడు. మ‌రోవైపు గ‌తంలో ఐపీఎల్ జ‌ట్టు రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు త‌ర‌పున కోహ్లీ-పీట‌ర్స‌న్ ఆడారు. ఇద్ద‌రి మ‌ధ్య మంచి స‌న్నిహిత సంబంధాలు కూడా ఉన్నాయి. మ‌రోవైపు కోహ్లీ కూడా సోష‌ల్ మీడియాలో త‌న‌కు సంబంధించిన వీడియ‌లోను పోస్టు చేస్తూ అభిమానుల‌ను అల‌రిస్తున్నాడు.

Must Read:
గ‌తంలో సినీ న‌టి, త‌న భార్య అనుష్క శ‌ర్మ త‌న‌కు హేర్ క‌టింగ్ చేస్తున్న వీడియోను కోహ్లీ పోస్టు చేసిన సంగ‌తి తెలిసిందే. మ‌రోవైపు ఈ సమయంలో కోహ్లీ… ఐపీఎల్ 13వ ఎడిష‌న్‌లో సంద‌డి చేయాల్సి ఉండేది. అయితే క‌రోనా వైర‌స్ కార‌ణంగా ఈ టోర్నీ నిర‌వ‌ధికంగా వాయిదా ప‌డింది. క‌రోనా హ‌డావిడి స‌ద్దుమ‌ణిగితే వ‌చ్చే అక్టోబ‌ర్లో ఈ టోర్నీ జ‌రిగే అవ‌కాశ‌ముంది.Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *