క్రికెటర్లకి ఈజీ మనీపైనే ఇంట్రస్ట్: వకార్క్రికెటర్లు దేశం తరఫున జాతీయ జట్టుకి ఆడటం కంటే ఈజీ మనీ కోసం టీ20 లీగ్స్‌పై ఎక్కువ శ్రద్ధ కనబరుస్తున్నారని బౌలింగ్ కోచ్ వకార్ యూనిస్ అభిప్రాయపడ్డాడు. 2008లో ఐపీఎల్ ప్రారంభమై గ్రాండ్ సక్సెస్ కావడంతో ఆ తర్వాత అన్ని క్రికెట్ దేశాలు టీ20 లీగ్స్‌ని స్టార్ట్ చేశాయి. ఈ క్రమంలో పాకిస్థాన్ కూడా పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్‌ఎల్‌)ని ప్రారంభించింది. కానీ.. ఐపీఎల్ తరహాలో ఆ టోర్నీ విజయవంతం కాలేదు.

Read More:

పాకిస్థాన్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ అమీర్ టీ20ల కోసం 27 ఏళ్ల వయసులోనే టెస్టులకి రిటైర్మెంట్ ప్రకటించగా.. ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది బౌలర్లు, బ్యాట్స్‌మెన్‌లు ఇదే బాటలో పయనిస్తున్నారు. ‘‘టీ20 లీగ్స్‌ క్రికెటర్లకి ఈజీ మనీని ఆఫర్ చేస్తున్నాయి. మరోవైపు ఆటగాళ్లు.. ముఖ్యంగా బౌలర్లు మ్యాచ్‌లో కేవలం నాలుగు ఓవర్లు వేయాల్సి ఉండటంతో చాలా సౌకర్యంగా భావిస్తున్నారు. కానీ.. వాళ్లు జాతీయ జట్టుకి దూరమైతే..? అక్కడ జరిగే నష్టాన్ని మాత్రం గుర్తించడం లేదు. క్రికెటర్లు రిటైర్మెంట్ ప్రకటించే ముందు కనీసం బోర్డు పెద్దలకి కూడా తమ నిర్ణయాన్ని చెప్పడం లేదు. సడన్‌గా సోషల్ మీడియా ద్వారా వీడ్కోలు పలుకుతుండటం బాధిస్తోంది’’ అని వకార్ వెల్లడించాడు.

Read More:

పాకిస్థాన్ క్రికెటర్లే కాదు.. వెస్టిండీస్ ఆటగాళ్లు కూడా ఇదే తరహాలో వ్యవహరిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా అన్ని టీ20 లీగ్స్‌లో ఆడుతున్న వెస్టిండీస్ సీనియర్ క్రికెటర్లు.. ఆ దేశం తరఫున ఆడేందుకు మాత్రమ ఆసక్తి కనబర్చడం లేదు. ఈ క్రమంలో వెస్టిండీస్ క్రికెట్ బోర్డుతో వాళ్లు గొడవకి దిగేందుకు కూడా వెనుకాడటం లేదు.Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *