క‌రోనా: చైనా ల్యాబ్‌లో పుట్టలేదు, అక్క‌డి నుంచి సంక్ర‌మ‌ణ: WHOక‌రోనా వైర‌స్‌ను ల్యాబ్‌ల్లో సృష్టించ‌లేద‌ని ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ (డ‌బ్ల్యూహెచ్ఓ) తాజాగా స్ప‌ష్టం చేసింది. ఇప్ప‌టివ‌ర‌కు ల‌భించిన ఆధారాల‌ను గ‌మ‌నించిన‌ట్ల‌యితే వైర‌స్ జీవుల నుంచి ఉద్భ‌వించింద‌ని సంస్థ అధికార ప్ర‌తినిధి పాబెలా చైబ్ తెలిపారు. మ‌రోవైపు అమెరికా స‌హా కొన్ని దేశాలు జీవాయుధం త‌యారీలో భాగంగా చైనా ఈ వైర‌స్‌ను రూపొందించిందని భావిస్తున్నాయి. అయితే ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ వ్యాఖ్య‌ల‌తో ఈ అనుమానాల‌పై స్ప‌ష్ట‌త వ‌చ్చిన‌ట్ల‌యింది.

Must Read:
అయితే ఇది జంతువుల నుంచి మ‌నుషుల‌కు ఎలా సోకిందో తెలియ‌డం లేద‌ని, క‌చ్చితంగా మ‌ధ్యంత‌ర వాహ‌కం ఉందని చైబ్ సందేహం వ్య‌క్తం చేశారు. ఈ వైర‌స్ ఎక్కువ‌గా గ‌బ్బిలాల్లో నివాసం ముంటుంద‌ని, అయితే మ‌నుషుల‌కు ఎలా సోకిందో ఆ వైనాన్ని క‌నిపెట్టాల్సి ఉంద‌ని తెలిపారు.

Must Read:

మ‌రోవైపు ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ‌కు నిధుల‌ను స‌మ‌కూర్చ‌బోమ‌ని అమెరికా అన్న మాట‌ల‌పై చైబ్ అస‌హ‌నం వ్య‌క్తం చేశారు. అమెరికా వ్యాఖ్యల‌ను ప‌రిశీలిస్తున్నామ‌ని, క‌రోనానే గాకుండా చాలా కార్య‌క్ర‌మాల‌ను త‌మ సంస్థ చేప‌డుతోంద‌ని గుర్తు చేశారు. మ‌రోవైపు సంస్థ‌కు నిధుల‌ను స‌మ‌కూర్చే అతిపెద్ద భాగ‌స్వామి అమెరికా కావ‌డం విశేషం. క‌రోనాపై డ‌బ్ల్యూహెచ్ఓ.. చైనా అనుకూల వైఖ‌రిపై ఆగ్ర‌హం చెందిన అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్.. నిధుల‌ను నిలిపివేశారు.Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *