క‌రోనా షాక్‌.. స‌న్‌రైజ‌ర్స్ ఉద్యోగాల్లో కోత‌ప్ర‌మాద‌క‌ర క‌రోనా వైర‌స్ కార‌ణంగా ప్ర‌పంచ‌వ్యాప్తంగా క్రీడా కార్య‌క‌లాపాలు వాయిదా ప‌డిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌తిష్టాత్మ‌క ఐపీఎల్‌, ఒలింపిక్స్ కూడా నిర‌వ‌ధింక‌గా వాయిదా ప‌డ్డాయి. ఈక్ర‌మంలో కొన్ని ఐపీఎల్ ఫ్రాంచైజీల ఉద్యోగాల్లో కోత ప‌డింది. ముఖ్యంగా స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టులోని స‌పోర్టింగ్ స్టాఫ్ ఒకరు జాబ్ కోల్పోయిన‌ట్లు తెలుస్తోంది. బంగ్లాదేశ్‌కు చెందిన బుల్‌బుల్ అహ్మ‌ద్‌‌ను ఈ సీజ‌న్ కోసం త్రోడౌన్ స్పెష‌లిస్టుగా స‌న్ ఎంపిక చేసింది. రూ.1.20 ల‌క్ష‌ల వేత‌నంతోపాటు ఐదువేల రూపాయల డీఏను కూడా ఆఫ‌ర్ చేసింది. క‌రోనా కార‌ణంగా లీగ్ వాయిదా ప‌డ‌టంతో ఇప్పుడు అహ్మ‌ద్‌ జాబ్ ప్ర‌మాదంలో ప‌డింది.

Must Read:
నిజానికి జ‌ట్టులో త్రోడౌన్ స్పెష‌లిస్టుల అవ‌స‌రం ఎంత‌గానో ఉంటుంది. బ్యాటింగ్ కోచ్ ఆధ్వ‌ర్యంలో వీళ్లు ప‌నిచేస్తారు. ముఖ్యంగా బ్యాట్స్‌మెన్ల‌కు ఒక లైన్ అండ్ లెంగ్త్‌తో గంటల త‌ర‌ప‌డి బౌలింగ్ చేస్తారు. అహ్మ‌ద్ కూడా బంగ్లా జ‌ట్టుతో ప‌నిచేశాడు. ఆసియాక‌ప్‌తోపాటు వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌లోనూ ప‌నిచేశాడు. మ‌రోవైపు టీమిండియాలో ఇద్ద‌రు త్రోడౌన్ స్పెష‌లిస్టులు ఉన్నారు.

Must Read:
గ‌త ప్ర‌పంచ‌క‌ప్‌న‌కు ముందు త్రోడౌన్ స్పెష‌లిస్టుల‌పై భార‌త విధ్వంస‌క ఓపెన‌ర్ శిఖ‌ర్ ధావ‌న్ ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిపించాడు. టీమిండియాలోనే త్రోడౌన్ స్పెష‌లిస్టు ర‌ఘు చాలా చురుకైన వ్య‌క్తి అని కొనియాడాడు. మ‌రోవైపు అత‌ను నిల‌క‌డ‌గా 150 కిమీ వేగంతో బౌలింగ్ చేస్తాడ‌ని కితాబిచ్చాడు.Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *