గంభీర్‌తో గొడవపై పెదవివిప్పిన కమ్రాన్ అక్మల్భారత మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్‌తో గొడవపై పాకిస్థాన్ సీనియర్ వికెట్ కీపర్ కమ్రాన్ అక్మల్ ఎట్టకేలకి పెదవివిప్పాడు. శ్రీలంక వేదికగా 2010లో జరిగిన ఆసియా కప్‌లో బ్యాటింగ్ చేస్తుండగా.. కమ్రాన్ అక్మల్ అస్తమానం కీపర్ క్యాచ్‌ కోసం అప్పీల్ చేశాడు. దాంతో సహనం కోల్పోయిన గౌతమ్ గంభీర్ అతనికి చిన్నపాటి వార్నింగ్ ఇవ్వగా.. కమ్రాన్ అక్మల్ కూడా అదే తరహాలో బదులివ్వడంతో మైదానంలో ఘర్షణ వాతావరణం నెలకొంది.

Read More:


మ్యాచ్‌లో అఫ్రిది ఓవర్ ముగిసిన తర్వాత ఫీల్డ్ అంపైర్లు డ్రింక్స్ బ్రేక్ ఇవ్వగా.. మరోసారి గంభీర్, కమ్రాన్ మధ్య మాటల యుద్ధం మొదలైంది. ఈ క్రమంలో ఇద్దరూ ఒకరినొకరు కొట్టుకునేలా కనిపించారు. అయితే.. మధ్యలో అంపైర్లు కలగజేసుకుని సర్దిచెప్పగా.. అప్పుడు గంభీర్‌తో కలిసి బ్యాటింగ్ చేస్తున్న మహేంద్రసింగ్ ధోనీ.. గంభీర్‌ని శాంతపరిచాడు. ఆ తర్వాత 2012-13లో భారత్, పాకిస్థాన్ మధ్య బెంగళూరు వేదికగా జరిగిన టీ20 మ్యాచ్‌లో ఇషాంత్ శర్మతోనూ కమ్రాన్ అక్మల్‌ వాగ్వాదానికి దిగాడు.

గంభీర్‌తో గొడవపై తాజాగా ఓ ఇంటర్వ్యూలో కమ్రాన్ అక్మల్ మాట్లాడుతూ ‘‘ఆ మ్యాచ్‌లో భేదాభిప్రాయాల కారణంగా గొడవ జరిగింది. కానీ.. ఆ ఘటనని మేము ఇద్దరం మైదానంలోనే మరిచిపోయి.. ఫ్రెండ్స్‌గా ఉన్నాం. క్రికెట్ టూర్స్ సమయంలో కలిసి భోజనం కూడా చేశాం. ఇప్పటికీ పరస్పరం గౌరవించుకుంటున్నాం’’ అని వెల్లడించాడు.

Read More:Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *