గతేడాది నవంబర్‌లోనే భారత్‌లోకి కరోనా వైరస్ ఎంట్రీదేశంలో తొలి కేసు జనవరి 30న నమోదైన సంగతి తెలిసిందే. కాగా అంతకు ముందే కోవిడ్ భారత్‌లోకి అడుగుపెట్టినట్లు హైదరాబాద్‌లోని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. టైమ్ టు మోస్ట్ రీసెంట్ కామన్ ఆన్‌సెస్టర్ అనే సైంటిఫిక్ టెక్నిక్ ఆధారంగా.. ప్రస్తుతం తెలంగాణతోపాటు ఇతర రాష్ట్రాల్లో ఉనికిలో ఉన్న కరోనా వైరస్ స్ట్రెయిన్ మూలాలు.. గత ఏడాది నవంబర్ 26 నుంచి డిసెంబర్ 25 కాలానికి చెందినవని పరిశోధకులు గుర్తించారు. అంటే జనవరి 30 కంటే చాలా ముందే వైరస్ భారత్‌లో అడుగుపెట్టిందన్న మాట.

నవంబర్, డిసెంబర్ నెలల్లో దేశంలో కరోనా టెస్టులు చేయలేదు. దీంతో ఈ వైరస్ ప్రయాణికుల నుంచి దేశంలోకి ప్రవేశించిందా లేదా అనే విషయంలో స్పష్టత లేదు. కరోనా వైరస్ రకరకాలుగా రూపాంతరం చెందగా.. హైదరాబాద్‌కు చెందిన సీసీఎంబీ పరిశోధకులతోపాటు ఇతర శాస్త్రవేత్తలు మోస్ట్ రీసెంట్ కామన్ ఆన్‌సెస్టర్ వయసును గణించారు. ఇప్పటికే తెలిసిన స్ట్రెయిన్‌తో పోలిస్తే.. కొత్తది భిన్నమైందని వారు గుర్తించారు. దీనికి క్లేడ్ I/A3 అని నామకరణం చేశారు.

కేరళలో గుర్తించిన కరోనా వైరస్‌కు వుహాన్ మూలాలు ఉండగా.. హైదరాబాద్‌లో గుర్తించింది దీనికి భిన్నమైంది. దీనికి ఆగ్నేయాసియా మూలాలు ఉన్నాయని సీసీఎంబీ డైరెక్టర్ డాక్టర్ రాకేశ్ కే మిశ్రా తెలిపారు. క్లేడ్ I/A3i రకం పూర్విక వైరస్ మనదేశంలో జనవరి 17 నుంచి ఫిబ్రవరి 25 మధ్య కాలం నుంచి రౌండ్లు కొడుతోందన్నారు. తెలంగాణతోపాటు తమిళనాడు, మహారాష్ట్ర, ఢిల్లీల్లో ఈ రకం ఎక్కువగా ఉందని తెలిపారు.Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *