గుంటూరులో హోంగార్డు ఆత్మహత్య.. కడపలో విషాదంగుంటూరులో విషాద ఘటన చోటుచేసుకుంది. వెలగపూడిలోని రాష్ట్ర సచివాలంలో విధులు నిర్వహిస్తున్న హోంగార్డు మహమ్మద్ పీరా(24) ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. జిల్లా మైదుకూరుకి చెందిన పీరా గతంలో ఏపీ డీజీపీ కార్యాలయంలో విధులు నిర్వర్తించేవాడు. ప్రస్తుతం వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయంలో పని చేస్తున్నాడు.

మంగళగిరిలోని వడ్లపూడి సెంటర్‌లో నివాసం ఉంటూ రోజూ విధులకు వెళ్లేవాడు. సడెన్‌గా తాను అద్దెకు ఉంటున్న ఇంట్లో శవమై తేలాడు. ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. చనిపోయే ముందు సూసైడ్ నోట్ రాసినట్లు తెలుస్తోంది. తన చావుకు ఎవరూ కారణం కాదని డైరీలో రాసి పెట్టినట్లు తెలుస్తోంది. అలాగే డైరీలో ఏటీఎం పిన్ వివరాలు కూడా రాసుకున్నట్లు సమాచారం. ఉదయం 10 గంటల సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని స్థానికులు చెబుతున్నారు. హోంగార్డు ఆత్మహత్యతో అతని స్వగ్రామంలో విషాదం నెలకొంది.

Also Read:Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *