గుడ్ న్యూస్.. ఆ మందులు కొవ్వునే కాదు, క్యాన్సర్‌నూ తగ్గిస్తున్నాయట!హిళల్లో క్యాన్సర్ ముప్పు ఎక్కువనే సంగతి తెలిసిందే. ముఖ్యంగా రొమ్ము క్యాన్సర్‌తో మహిళలు ఎంతో జాగ్రత్తగా, అప్రమత్తంగా ఉండాలి. కొలొరెక్టల్ (పెద్ద పేగు) క్యాన్సర్, లేదా మెలనోమా ముప్పు కూడా వీరికే ఎక్కువ. అయితే, తాజా అధ్యయనంలో ఓ ఆసక్తికర విషయం తెలిసింది. వివిధ క్యాన్సర్లతో బాధపడుతున్న మహిళలు.. కొవ్వు తగ్గేందుకు వాడే మందులతో మరణాన్ని జయిస్తున్నారట.

బ్రిటీష్ జర్నల్ ఆఫ్ క్లీనికల్ ఫార్మకాలజీలో ప్రచురితమైన ఈ విశ్లేషణ ప్రకారం.. ఆస్ట్రేలియాలో రొమ్ము, కొలోరెక్టల్, మెలనోమా క్యాన్సర్లకు చికిత్స పొదిన 6,430 మంది మహిళల ఆరోగ్య పరిస్థితులను 2003 నుంచి 2013 వరకు పరీక్షించారు. రోగ నిర్ధరణకు ముందుగానే వీరికి శరీరంలో కొవ్వును తగ్గించే మందులను అందించారు.

ఈ సందర్భంగా కొందరు మహిళల్లో ఘననీయమైన మార్పును గమనించారు. వీరిలో క్యాన్సర్ నిర్ధరణ జరిగిన తర్వాత కూడా చనిపోయే ముప్పు తక్కువగా కనిపించినట్లు గుర్తించారు. కొవ్వు తగ్గేందుకు ఉపయోగిస్తున్న మందుల్లో ఉండే యాంటీ ట్యూమర్ గుణాల వల్లే వారు.. క్యాన్సర్‌ మరణాల నుంచి బయటపడుతున్నట్లు భావిస్తున్నారు.

Read Also:

ఈ సందర్భంగా QIMR బెర్గాఫర్ మెడికల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూ్ట్‌కు చెందిన బీమెడ్, ఎంహెడ్, పీహెచ్‌డీ సహ రచయిత లియా-లి ఫెంగ్ మాట్లాడుతూ.. కొవ్వు తగ్గించే ముందులకు క్యాన్సర్ కణాలతో పోరాడే సామర్థ్యం ఉన్నట్లు ధృవీకరించబడితే.. భవిష్యత్తులో ఆ ఔషదాలు రోగులకు ఎంతో ఉపయుక్తంగా మారతాయని తెలిపారు.

Read also:

గమనిక: ఈ కథనంలో పేర్కొన్న అంశాలన్నీ పరిశోధన దశలోనే ఉన్నాయి. దీన్ని ప్రమాణికంగా తీసుకుని సొంత చికిత్స అస్సలు ప్రయత్నిచవద్దని మనవి. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే అందించామని గమనించగలరు.Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *