గుడ్ న్యూస్: జన్‌ధన్ ఖాతాల్లో మరోసారి నగదు డిపాజిట్లాక్‌డౌన్‌తో ఇబ్బందులు పడుతున్న పేదలకు కేంద్ర ప్రభుత్వం మరోసారి గుడ్ న్యూస్ అందించింది. మహిళల జన్‌ధన్‌ ఖాతాల్లో రెండో విడత నగదు జమ చేయనున్నట్లు వెల్లడించింది. మే నెలకు సంబంధించి రూ.500 చొప్పున ఆర్థిక సాయం ఆయా బ్యాంకులు సోమవారం నుంచి జమ చేయనున్నట్లు కేంద్రం శనివారం (మే 2) ప్రకటించింది. మే 4 నుంచి డబ్బులు విత్‌డ్రా చేసుకోవచ్చని తెలిపింది. అయితే.. సామాజిక దూరం పాటించేలా ఈసారి కీలక నిర్ణయం తీసుకుంది. ఖాతాదారుల అకౌంట్‌ నంబర్ల చివరి అంకె ఆధారంగా వారికి నిర్ణీత రోజు నగదు తీసుకునేందుకు అవకాశం కల్పించనున్నారు. తద్వారా బ్యాంకుల వద్ద రద్దీ తగ్గుతుందని అధికారులు భావిస్తున్నారు.

వీలైనంత వరకు ఏటీఎం కార్డులు, బ్యాంకు మిత్ర సేవలను వినియోగించుకోవాలని ఆర్థిక సేవల కార్యదర్శి దేవాశిష్‌ పాండా సూచించారు. 0, 1తో ముగిసే అకౌంట్‌ ఖాతాదారులకు తొలి రోజున, 2, 3 నెంబర్లతో ముగిసే ఖాతాదారులు మే 5న, 4, 5 నెంబర్లతో ముగిసే ఖాతాదారులకు మే 6న విత్‌డ్రా చేసుకునే అవకాశం కల్పించారు. అదేవిధంగా 6, 7 నెంబర్లతో ముగిసే ఖాతాదారులు మే 8వ తేదీన, 8, 9 నెంబర్లతో ముగిసే అకౌంట్‌ నంబర్‌ ఉన్న వారు మే 11న.. వారి వారి అకౌంట్‌ల నుంచి రూ.500 తీసుకోవచ్చని తెలిపారు. ఇక మే 11 తర్వాత ఎప్పుడైనా వారి వారి సౌకర్యాన్ని బట్టి డబ్బులు తీసుకోవచ్చని అధికారులు వెల్లడించారు.

లాక్‌డౌన్‌ నేపథ్యంలో పేద కుటుంబాలను ఆదుకునేందుకు మహిళల జన్‌ధన్‌ ఖాతాల్లో ఏప్రిల్‌ నుంచి 3 నెలల పాటు రూ.500 చొప్పున జమ చేస్తామని కేంద్రం ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. ఏప్రిల్‌లో 20.05 కోట్ల ఖాతాల్లో రూ.10,025 కోట్లు జమ చేసింది. అయితే.. 2014 కంటే ముందు తెరిచిన ఖాతాల్లో వేసిన డబ్బులు వెనక్కి తీసుకోవడం ఇటీవల దేశంలో కలకలం సృష్టించింది.

Also Read:Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *