జాజికాయతో అద్భుత ప్రయోజనాలు.. పడక గదిలో ప్రతిరోజూ పండగే! కానీ…జాజికాయ.. ఇన్నాళ్లు మనం వంటల్లో రుచి, సువాసనల కోసమే వాడుతున్నాం. కానీ, ఇందులో ఉండే ఔషద గుణాల గురించి తెలిస్తే మీరు తప్పకుండా ఆశ్చర్యపోతారు. జాజికాయ మెదడు ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఒత్తిడి, అలసట, ఆందోళనలను దూరం చేయడంలో జాజికాయకు మరేదీ సాటిలేదు. ఇక సెక్స్ సామర్థ్యం, వీర్యం సమస్యలతో బాధపడేవారికి.. ఇది గొప్ప ఔషదం. మరి, జాజికాయతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో చూసేద్దామా!

సెక్స్ సమస్యల కోసం…:
❂ మగతనాన్ని మేల్కొపడంలో జాజికాయ భలే పనిచేస్తుంది. సెక్స్ సామర్థ్యాన్ని పెంచడమే కాకుండా వీర్యవృద్ధికి తోడ్పడుతుంది.
❂ రోజూ అర స్పూన్ జాజికాయ పొడిని పాలలో కలుపుకుని తాగితే సెక్స్ సామర్థ్యం పెరుగుతుంది.
❂ జాజికాయను సన్నని సెగపై నేతిలో వేయించి పొడి చేసుకుని డబ్బాలో పెట్టండి. ఐదు గ్రాముల చూర్ణాన్ని ఉదయం, సాయంత్రం పాలతో మరిగించి సేవిస్తే సంతాన లేమిని తొలగిస్తుంది.
❂ పురుషుల్లో ఏర్పడే నపుంసకత్వం, శీఘ్ర స్కలనం వంటి లైంగిక సమస్యలను దూరం చేస్తుంది.
❂ స్త్రీలకు రుతుక్రమ సమయంలో ఏర్పడే నొప్పులను తగ్గిస్తుంది.

ఇంకా ఎన్నో ప్రయోజనాలు: ❂ మిమ్మల్ని నిద్రలేమి సమస్య వెంటాడుతుంటే.. జాజికాయ తీసుకోండి. నిద్రించడానికి 15 నిమిషాల ముందు ఒక స్పూన్ తేనెలో చిటికెడు జాజికాయ పొడిని కలిపి తాగితే మంచి నిద్ర పడుతుంది.
❂ జాజికాయ పురుషుల్లో నరాల బలహీనతకు చెక్ పెడుతుంది.
❂ జాజికాయకు కామెర్ల వ్యాధిని తగ్గించే శక్తి కూడా ఉంది.
❂ నాలుక మీద పాచి ఎక్కువగా ఉన్నా, నాలుక జిగురుగా ఉన్నా జాజికాయను రాయండి.
❂ నీళ్ళ విరేచనాలకు అడ్డుకట్ట వేస్తోంది.
❂ ఆహారాన్ని జీర్ణం చేసి మలబద్దకాన్ని తొలగిస్తుంది.
❂ కిడ్నీల్లో రాళ్లను కరిగించడంలోనూ జాజికాయ ఉత్తమంగా పనిచేస్తుంది.
❂ జాజికాయ గుండె ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది.
❂ జాజికాయ అధిక రక్తపోటును తగ్గిస్తుంది.
❂ గుండె నొప్పిని తొలగించడమే కాకుండా బీపీని నియంత్రిస్తుంది.
❂ జాజికాయ, సొంఠి అరగదీసి కణతలకు పట్టు వేస్తే తలనొప్పి, మైగ్రేన్‌ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.
❂ జాజికాయ ముక్కను నమిలితే దంతాల్లోని క్రిములు నశిస్తాయి.
❂ దగ్గు, జలుబు నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
❂ జాజికాయలో ఉండే ‘మినిస్టిసిన్’ అనే పదార్థం మెదడును చురుకుగా ఉంచుతుంది.
❂ అల్జీమర్స్ సమస్యలకూ జాజికాయను వాడతారు.
❂ జాజికాయను గంధంలా అరగదీసి 2-3 బొట్లు చెవిలో వేస్తే చెవిపోటు సమస్య ఉండదు.
❂ అర స్పూన్ జాజికాయ పొడిని పాలలో కలుపుకుని తాగితే సెక్స్ సామర్థ్యం పెరుగుతుంది.
❂ చర్మం ప్రకాశవంతంగా మెరవాలంటే.. గంధంలో జాజికాయ పొడిన చందనంతో కలిపి ముఖాన్నికి రాసుకోండి.
❂ జాజికాయతో మొటిమలు, మచ్చలు సైతం తొలగిపోతాయి.
❂ జాజికాయతో తామర వంటి చర్మ వ్యాధులను కూడా తరిమి కొట్టవచ్చు.
❂ చికెన్ ఫాక్స్ ఉన్నవారు జాజికాయ, జీలకర్ర, శొంఠి పొడుల్ని భోజనానికి ముందు పావు స్పూన్ తీసుకుంటే ఉపశమనం లభిస్తుంది.
❂ డయేరియా, అపానవాయువు, మలబద్దకం, వాంతులు, ఉబ్బరం, అజీర్ణం వంటి సమస్యలకు జాజికాయ మంచి ఔషదం.
❂ శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపడంలో జాజికాయ చక్కగా పనిచేస్తుంది.
❂ కాలేయ, మూత్రపిండ వ్యాధుల నివారణకు జాజికాయ మంచిదని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.

Also Read:

ముఖ్య గమనిక: ప్రకృతిలో లభించే ఎన్నో పదార్థాలు మానవ శరీరానికి మేలు చేస్తాయి. అలాగని వాటిని ఎక్కువగా తీసుకుంటే ప్రతికూలంగా మారవచ్చు. ఏదైనా సరే మితంగానే తీసుకోవాలి. జాజికాయ మేలు చేస్తుందని అతిగా తీసుకుంటే కొత్త సమస్యలు రావచ్చు. జాజికాయను అతిగా వాడితే జీర్ణ సంబంధ సమస్యల తలెత్తుతాయి. ఏకాగ్రత కోల్పోవడం, చెమట ఎక్కువ పట్టడం వంటి సమస్యలు వస్తాయి. గర్భవతులు జాజికాయను అస్సలు ఉపయోగించవద్దు. జాజికాయను ఔషదంగా వాడేందుకు సొంత వైద్యాన్ని నమ్మకండి. వీలైతే ఆయుర్వేద వైద్యుల సలహాలు, సూచనలు తీసుకోండి. జాగ్రత్తగా ఉండండి.

Also Read:Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *