జీవితాంతం ఆర్సీబీ త‌ర‌పునే ఆడ‌తా: డివిలియ‌ర్స్‌ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్)లోనే అత్యంత ఫేమ‌స్ విదేశీ క్రికెట‌ర్ల‌లో ఏబీ డివిలియ‌ర్స్ ఒక‌రు. 2011 నుంచి రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు త‌ర‌పున ఏబీ ఆడుతున్నాడు. తాజాగా సోష‌ల్ మీడియాలో డివిలియ‌ర్స్ మాట్లాడుతూ.. త‌న జీవితకాలం మొత్తం ఆర్సీబీ త‌ర‌పునే ఆడ‌తాన‌ని డివిలియ‌ర్స్ పేర్కొన్నాడు. 2008లో ఢిల్లీ డేర్‌డెవిల్స్ (ఇప్పుడు ఢిల్లీ క్యాపిటల్స్) త‌ర‌పున అరంగేట్రం చేసిన డివిలియ‌ర్స్‌.. 2011 నుంచి ఇప్ప‌టివ‌ర‌కు ఆర్సీబీ త‌ర‌పునే ఆడుతున్నాడు.

Must Read:
తొలి నాలుగు సీజ‌న్ల‌పాటు ఆర్సీబీ త‌ర‌పున ఆడిన తను.. ఐదో ఎడిష‌న్ నుంచి ఎప్ప‌టికీ ఈ జ‌ట్టుతోనే ఆడాల‌ని భావించిన‌ట్లు డివిలియ‌ర్స్ పేర్కొన్నాడు. మ‌రోవైపు ఇటీవ‌లే క‌రోనా వైర‌స్ (కోవిడ్‌-19) బాధితుల కోసం ఆర్సీబీ కెప్టెన్ విరాట్ కోహ్లీతో క‌లిసి డివిలియ‌ర్స్‌.. జ‌ట్టు జెర్సీల‌ను వేలం వేసిన సంగ‌తి తెలిసిందే.

Must Read:
ఆర్సీబీ త‌ర‌పున 126 మ్యాచ్‌లాడిన ఏబీ.. 3,724 ప‌రుగులు సాధించిన సంగ‌తి తెలిసిందే. ఇక క‌రోనా వైర‌స్ కార‌ణంగా ఈ ఏడాది ఐపీఎల్ వాయిదా ప‌డింది. వ‌చ్చే సెప్టెంబ‌ర్ నెల‌లో ఐపీఎల్‌ను నిర్వ‌హించే అవ‌కాశాలున్నాయ‌ని విశ్లేష‌కులు పేర్కొంటున్నారు. 2008లో ప్రారంభ‌మైన ఐపీఎల్.. ఇప్ప‌టివ‌ర‌కు 12 ఎడిష‌న్ల‌పాటు నిరాటంకంగా సాగింది. 2009ను పూర్తిగా, 14 ఎడిష‌న్‌ను పాక్షికంగా విదేశాల్లో నిర్వ‌హించిన సంగ‌తి తెలిసిందే.Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *