టీమిండియాలోకి ఆ వెట‌ర‌న్ క్రికెట‌ర్ క‌మ్‌బ్యాక్ పక్కా: రాయుడు‌భార‌త వెట‌ర‌న్ క్రికెట‌ర్ .. టీమిండియాలోకి పున‌రాగనం చేస్తాడ‌ని తెలుగు ప్లేయ‌ర్ అంబ‌టి తిరుప‌తి రాయుడు పేర్కొన్నాడు. రైనాలో ఎంతో క్రికెట్ దాగుంద‌ని తెలిపాడు. తాజాగా ఐపీఎల్ ఫ్రాంచైజీ చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) సోష‌ల్ మీడియాలో రాయుడితో సంభాషించింది. ఈ క్ర‌మంలో కొన్ని ప్ర‌శ్న‌లు అడుగ‌గా.. అత‌ను స‌మాధానాలిచ్చాడు. రైనా తిరిగి భార‌త జ‌ట్టులోకి క‌మ్‌బ్యాక్ చేస్తాడా అని రాయుడిని అడుగ‌గా.. అత‌ను పై విధంగా తెలిపాడు. సీఎస్కేలో రాయుడు-రైనా చాలాకాలంగా క‌లిసి ఆడుతున్న సంగ‌తి తెలిసిందే.

Must Read:
ఎంఎస్ ధోనీ హ‌యాంలో భార‌త జ‌ట్టులో రైనా కీల‌క స‌భ్యునిగా వ్యవహరించాడు. ఈక్రమంలో ఎన్నో మ్యాచ్‌ల్ని గెలిపించాడు. 2011 వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ గెలిచిన టీమిండియాలోనూ రైనా సభ్యుడు. అయితే గ‌త రెండేళ్ల నుంచి అత‌ణ్ని ఫామ్ లేమి, గాయాలు తదితర కారణాలతో టీమిండియాలోకి ఎంపిక చేయ‌డం లేదు. చివ‌రిసారిగా 2018లో ఇంగ్లాండ్‌తో సిరీస్‌లో అతను ఆడాడు.

Must Read:
ఆ సిరీస్‌లో ఫామ్ కోల్పోవ‌డంతో అప్పటి నుంచి రైనాను టీమిండియాలోకి ప‌రిగ‌ణించ‌డం లేదు. తాజాగా రైనా గురించి రాయుడు మాట్లాడుతూ.. రైనాలో ఎంతో క్రికెట్ మిగిలి ఉంద‌ని, అత‌ను క‌చ్చితంగా టీమిండియాలోకి రీఎంట్రీ ఇస్తాడ‌ని అన్నాడు. దీనిపై తాను పందెం కాయ‌డానికి కూడా సిద్ధంగా ఉన్నాన‌ని తెలిపాడు. మ‌రోవైపు ఐపీఎల్‌లో సీఎస్కే త‌ర‌పున కీల‌క స‌భ్యునిగా రైనా వ్య‌వ‌హ‌రిస్తున్నాడు. గ‌తేడాది కూడా 17 మ్యాచ్‌ల్లో 380కిపైగా ప‌రుగులు సాధించాడు.Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *