టీ20ల్లో.. టీమిండియాకి ఆడేందుకు నేను రెడీ: హర్భజన్ క్లారిటీభారత్ తరఫున టీ20ల్లో మళ్లీ ఆడేందుకు తాను సిద్ధమని వెటరన్ ఆఫ్ స్పిన్నర్ వెల్లడించాడు. 2016 ఆసియా కప్‌లో టీమిండియాకి ఆఖరిగా ఆడిన హర్భజన్ సింగ్.. ఆ తర్వాత కనీసం దేశవాళి క్రికెట్‌‌లో కూడా మ్యాచ్‌లు ఆడలేదు. కానీ.. ఐపీఎల్‌లో మాత్రం రెగ్యులర్‌గా ఈ ఆఫ్ స్పిన్నర్ ఆడుతున్నాడు. గత రెండు సీజన్లుగా చెన్నై సూపర్ కింగ్స్‌ తరఫున ఈ 39 ఏళ్ల హర్భజన్ నిలకడగా రాణిస్తున్న విషయం తెలిసిందే.

ఐపీఎల్‌లో ఆడుతున్నారు.. మరి అంతర్జాతీయ క్రికెట్‌లోనూ మళ్లీ టీ20ల్లో ఆడతారా..? అని ప్రశ్నించగా.. హర్భజన్ సమాధానమిచ్చాడు. ‘‘హా.. ఇంటర్నేషనల్ క్రికెట్‌లో ఆడేందుకు నేను రెడీ. ఐపీఎల్‌లో మెరుగ్గా బౌలింగ్ చేయగలిగితే..? అంతర్జాతీయ క్రికెట్‌లోనూ సులువుగా బౌలింగ్ చేయొచ్చు. ఎందుకంటే ఐపీఎల్‌లో టాప్ క్లాస్ బ్యాట్స్‌మెన్‌లు ఆడుతుంటారు. దానికితోడు గ్రౌండ్స్‌ కూడా చిన్నవిగా ఉంటాయి. కాబట్టి.. ఐపీఎల్‌లో బౌలింగ్ చేయడం కష్టం. ఐపీఎల్‌లో నేను రెగ్యులర్‌గా పవర్‌ప్లే, మిడిల్ ఓవర్లలోనూ బౌలింగ్ చేసి.. వికెట్లు పడగొట్టగలను’’ అని హర్భజన్ సింగ్ ధీమా వ్యక్తం చేశాడు.

ఐపీఎల్‌లో ఇప్పటి వరకూ 160 మ్యాచ్‌లాడిన హర్భజన్ సింగ్ 150 వికెట్లు పడగొట్టాడు. టోర్నీ చరిత్రలో అత్యధిక వికెట్లు పడగొట్టిన మూడో బౌలర్‌గా కొనసాగుతున్న భజ్జీ.. బెస్ట్ ప్రదర్శన 5/18.Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *