ట్రంప్‌‌తో పోటీకి బిడెన్: నల్లజాతీయుల నుంచి భారీ మద్దతు.. డెమొక్రట్ల అభ్యర్థిగా ఖరారుఅమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రట్ పార్టీ నుంచి అభ్యర్థిత్వం అధికారికంగా ఖరారయ్యింది. అధ్యక్ష పోటీకి అవసరమైన 1993 మంది ప్రతినిధులు మద్దతు బిడెన్‌కు లభించింది. అలాగే, అదే పార్టీకి చెందిన బెర్ని శాండర్స్ సైతం ఏప్రిల్‌లో పోటీ నుంచి తప్పుకోవడంతో బిడెన్‌కు మార్గం సుగమం అయ్యింది. దీంతో డెమొక్రట్ అభ్యర్థిగా ట్రంప్‌తో మాజీ ఉపాధ్యక్షుడు బిడెన్ తలపడనున్నారు. మొత్తం ఎనిమిది రాష్ట్రాలు, మూడు అమెరికా ప్రాదేశిక ప్రాంతాలకు చెందిన ప్రతినిధులు బిడెన్‌కు మద్దతు తెలిపారు.

త్వరలో జో బిడెన్ తన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. ప్రతినిధులు తనకు మద్దతు ఇవ్వడం పట్ల బోడెన్ సంతోషం వ్యక్తం చేశారు. ఇది తనకు దక్కిన గౌరవంగా ఆయన వ్యాఖ్యానించారు. ‘ఈ దేశం ఆత్మ కోసం జరిగే యుద్ధంలో విజయం సాధించడానికి దేశవ్యాప్తంగా ఉన్న అమెరికన్ల ఓట్లను సంపాదించడానికి ఇక రోజూ ప్రయత్నిస్తానని హామీ ఇచ్చారు. దక్షిణ కెరొలినాలో తాను నిర్వహించిన ప్రచారాన్ని బిడెన్ ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు.

‘ఇప్పుడు మనకు గౌరవం తెచ్చే ఉద్యోగాలు కావాలి.. ప్రతి అమెరికన్‌కు సమన్యాయం జరగాలి.. సమాన అవకాశాలు అవసరం… వారి అవసరాలు తీర్చి, సహాయపడే ఒక అధ్యక్షుడు కావాలి’అని వ్యాఖ్యానించారు. దేశం గతంలో ఎన్నడూ చూడని నిరుద్యోగాన్ని చవిచూస్తోందని, 1960 తర్వాత అంతటి స్థాయిలో హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటున్నాయని ట్రంప్ పాలనపై ఆయన ధ్వజమెత్తారు.

ఇక, 77 ఏళ్ల బిడెన్ 36 ఏళ్ల నుంచి సెనేటర్‌గా కొనసాగుతున్నారు. ఇక, అధ్యక్ష ఎన్నికల్లో పోటీకి మూడోసారి ప్రయత్నించి, విజయం సాధించారు. గతంలో రెండుసార్లు పోటీపడినా డెమొక్రాట్ల మద్దతు పొందలేకపోయారు. ఫిబ్రవరిలో అధ్యక్ష ఎన్నికల్లో పోటీకి నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైన తర్వాత అయోవా కాకస్‌లో బిడెన్ నాల్గో స్థానంలో నిలిచారు. న్యూ హాంప్‌షైర్‌కు వచ్చేసరికి కాస్త మెరుగుపడిన బిడెన్, దక్షిణ కెరొలినాలో నల్లజాతి ఓటర్లను ఆకర్షించడంలో కృతకృత్యులయ్యారు.

దక్షిణ కెరొలినాలో తన సమీప ప్రత్యర్థి సాండర్స్‌ను దాదాపు 29 పాయింట్ల తేడాతో ఓడించారు. పదమూడు రాష్ట్రాలలో మంగళవారం నుంచి జరిగిన మూడు రోజులగా సాగిన ప్రదర్శనలో 9 చోట్ల ఆధిపత్యం ప్రదర్శించారు.Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *