డబ్ల్యూహెచ్ఓకు నిధులు.. ముందు వరుసలో గేట్స్ ఫౌండేషన్(డబ్ల్యూహెచ్‌వో)తో తెగదెంపులు చేసుకుంటున్నట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ పునరుద్ఘాటించిన విషయం తెలిసిందే. కరోనా వైరస్‌ వ్యాప్తి నియంత్రణలో పూర్తిగా విఫలమైన చైనాను వెనకేసుకొస్తోందని, అలాంటప్పుడు మేము నిధులిచ్చి ఏం లాభం?అందుకే ఆ సంస్థతో తెగదెంపులు చేసుకుంటున్నాం. డబ్ల్యూహెచ్‌వోకు ఎన్నో మార్పులు చేర్పులు చేయాల్సి ఉంది అని అన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థకు అత్యధికంగా నిధులు అమెరికా నుంచే అందుతుండగా.. ప్రస్తుతం అవి నిలిచిపోతున్నాయి. దీంతో డబ్ల్యూహెచ్ఓకు అత్యధికంగా నిధులు అందజేసే జాబితాలో బిల్ తొలిస్థానంలో నిలిచింది.

డబ్ల్యూహెచ్ఓకు నిధులు అందజేసే టాప్ 10 జాబితాలో నాలుగు సభ్యదేశాలు మాత్రమే ఉండగా.. మిగతావి స్వచ్ఛంద సంస్థలు, దాతలు ఉన్నారు. అయితే, డబ్ల్యూహెచ్ఓ ఏర్పడినప్పుడు దాని రాజ్యాంగం.. ప్రధానంగా దేశ సంపద, జనాభా అధారంగా అంచనా వేసి సభ్య దేశాల నుంచి క్రమం తప్పకుండా నిధులు సమకూర్చాలని నిర్దేశించింది. అయితే, వార్షిక నిధులను పెంచడానికి సభ్య దేశాల అయిష్టతను ప్రదర్శించడంతో స్వచ్ఛంద సంస్థలు, దాతలపై ఎక్కువగా ఆధారపడటం, దాని స్వయంప్రతిపత్తిని దెబ్బతీస్తోంది.

డబ్ల్యూహెచ్ఓ స్వచ్ఛంద సంస్థలు, దాతలపై ఎక్కువగా ఆధారపడటం ఆరోగ్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇక, 2019లో దీని బడ్జెట్ కేవలం 5.6 బిలియన్ డాలర్లు మాత్రమే. ఇది అమెరికాలోని ఒక పెద్ద ఆసుపత్రి ఆదాయం కంటే తక్కువ. డబ్ల్యూహెచ్ఓ నిధులలో మూడొంతుల కంటే ఎక్కువ పోలియో నిర్మూలన, టీబీ వంటి నిర్దిష్ట కార్యక్రమాల కోసం కేటాయించాలనే నిబంధనలు ఉన్నాయి. అందువల్ల, ఎబోలా వైరస్, ఇప్పుడు కరోనావైరస్ మహమ్మారి వంటి పరిస్థితులకు తగిన ప్రతిస్పందన కోసం నిధులను సమకూర్చడం కోసం చాలా శ్రమిస్తోంది.

‘పెద్ద, చిన్న దేశాలు కలిసి డబ్ల్యూహెచ్ఓను ఏర్పాటుచేశాయి.. బిలియనీర్ల గురించి సాధారణ ఆందోళన ఉన్నా… వారి పెట్టుబడులను స్వాగతించారు.. గేట్స్ ఫౌండేషన్ నిధులు పెద్ద మొత్తంలో అందజేసి ప్రపంచ ఆరోగ్య వ్యవస్థను వలసరాజ్యంగా చేసినట్లు ఉంది. వారు మంచి ఉద్దేశంతో ఉన్నా, గుత్తాధిపత్యం ఉన్నప్పుడు, ప్రశ్నించే అవకాశం ఉండదని’ మాంచెస్టర్ యూనివర్సిటీ హ్యుమానిటేరియన్ అఫైర్స్ ప్రొఫెసర్ డాక్టర్ ముఖేష్ కపిలా అన్నారు. పీహెచ్‌ఎఫ్‌ఐకి చెందిన డాక్టర్ శ్రీనాథ్ రెడ్డితో కలిసి డబ్ల్యూహెచ్‌ఓ ఆర్ధిక స్థిరత్వంపై ఒక పరిశోధన పత్రం సమర్పించారు.Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *