దేశంలో కరోనా విశ్వరూపం.. 2.5 లక్షలు దాటిన కేసులు, చైనాను దాటేసిన ఆ ఒక్క రాష్ట్రం!దేశవ్యాప్తంగా కరోనా వైరస్‌ మహమ్మారి తీవ్రంగా విజృంభిస్తోంది. ఆదివారం నమోదైన కేసులతో దేశవ్యాప్తంగా కరోనా సోకిన వారి సంఖ్య 2.5 లక్షలు దాటింది. ఆదివారం కొత్తగా 9,971 పాజిటివ్‌ కేసులు నమోదవ్వడంతో ఆదివారం ఉదయానికి దేశంలో కొవిడ్‌-19 బారినపడ్డ వారి సంఖ్య 2,46,628కి చేరింది. వివిధ రాష్ట్రాలు ప్రకటించిన లెక్కల ప్రకారం సాయంత్రానికి ఆ సంఖ్య 2.5 లక్షలు దాటింది. ఇక రాష్ట్రాల వారీగా చూసుకుంటే మహారాష్ట్రలో అతి వేగంగా వైరస్‌ విస్తరిస్తోంది. గడిచిన 24 గంటల్లో 3007 కొత్త కేసులు నమోదయ్యాయి. మృతుల సంఖ్య కూడా 3 వేలు దాటింది. మొత్తంగా చూసుకుంటే 85,975 కరోనా కేసులతో మహారాష్ట్ర వైరస్‌ పుట్టినిల్లయిన చైనాను మించిపోయింది.

చైనా విడుదల చేసిన అధికారిక లెక్కల ప్రకారం ఆ దేశంలో కేసుల సంఖ్య 83,036గా ఉంది. మరోవైపు తమిళనాడులో కూడా వేగంగా విస్తరిస్తోంది. ప్రస్తుతం తమిళనాడు రాష్ట్రంలో 31,667 కేసులు నమోదయ్యాయి. 269 మంది మృత్యువాతపడ్డారు. దేశ రాజధాని ఢిల్లీలో లాక్‌ డౌన్‌ సడలింపుల తర్వాత కేసుల నమోదులో వేగం పెరిగింది. మొత్తం 27,654 కేసులు నమోదు కాగా, 761 మంది మరణించారు. గుజరాత్‌ కేసుల సంఖ్య 19,592గా ఉండగా, మృతుల సంఖ్య 1,219. ఉత్తర్‌ప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో 433 కొత్త కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 10,536కి చేరింది.

తెలుగు రాష్ట్రాల్లో సైతం భారీగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం సంఖ్య 3,718కు చేరాయి. కమ్యులేటివ్ పాజిటివ్ కేసులు 810 ఉన్నాయి. అలాగే విదేశాల నుంచి వచ్చిన 131 మందికి వైరస్ సోకింది. దీంతో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మొత్తం కేసులు 4,659కు చేరాయి.

అలాగే, తెలంగాణ రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3650కు చేరుకుంది. వీటిలో, మొత్తం లోకల్ కేసులు మాత్రం 3202 అని హెల్త్ బులెటిన్‌లో వివరించారు. అలాగే తెలంగాణలో కరోనా మృతుల సంఖ్య 137కి చేరుకుంది.Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *