దేశంలో కొనసాగుతోన్న కరోనా విజృంభణ.. నిన్న ఒక్క రోజే 7,700 కేసులుదేశంలో రోజు రోజుకూ రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 7,700కిపైగా కొత్త కేసులు నమోదయ్యాయి. పాజిటివ్ కేసుల్లో రోజు కొత్త రికార్డులు నమోదుకావడం గమనార్హం. అలాగే, కరోనా మరణాల్లోనూ శుక్రవారం సరికొత్త రికార్డు నమోదయ్యింది. గడచిన 24 గంటల్లో ఏకంగా 279 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశంలో 5వేలకు చేరవయ్యాయి. దేశవ్యాప్తంగా కరోనా వైరస్ కేసుల సంఖ్య 173,491కి చేరగా.. మరణాలు 4,980గా నమోదయ్యాయి. అయితే, దేశవ్యాప్తంగా కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య కూడా భారీగానే ఉంది.

ఇప్పటి వరకూ 82,627 మంది బాధితులు కోలుకున్నారు. మరో 85,873 మంది హాస్పిటల్స్‌లో చికిత్స పొందుతున్నారు. అంటే దేశంలో కరోనా బాధితుల రికవరీ రేటు 47.3 శాతంగా ఉంది. అత్యధికంగా మహారాష్ట్రలో శుక్రవారం 8,381 మంది కోలుకున్నారు. ముంబయిలోనే అత్యధికంగా దేశవ్యాప్తంగా గడచిన 24 గంటల్లో 12వేల మందికిపైగా కోలుకోవడం శుభపరిణామం. మహారాష్ట్ర సహా ఏడు రాష్ట్రాల్లో శుక్రవారం భారీగా పాజిటివ్ కేసుల నమోదయ్యాయి.

మహారాష్ట్రలో శుక్రవారం 2,500 మందికిపైగా కొత్తగా వైరస్ సోకింది. అయితే, ఇక్కడ ఒకే రోజు 8వేల మందికిపైగా కోలుకోన్నారు. వీరిలో వైరస్ హాట్‌స్పాట్ ముంబయిలోనే అత్యధికంగా ఉన్నారు. తర్వాతి ఢిల్లీ 1,016, తమిళనాడు 874, రాజస్థాన్ 298, బెంగాల్ 277, ఉత్తరప్రదేశ్ 275, కర్ణాటక 248, ఉత్తరాఖండ్ 216, తెలంగాణ 169, అసోం 144, జమ్మూ కశ్మీర్ 128, చత్తీస్‌గఢ్ 51 కేసులు వెలుగుచూశాయి.

తెలంగాణలో శుక్రవారం మరో 169 కరోనా వైరస్‌ కేసులు నమోదయ్యాయి. ఇందులో 100 మంది స్థానికులు కాగా, సౌదీ అరేబియా నుంచి వచ్చిన 64 మందిలో, తెలంగాణ నుంచి ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లి తిరిగి ఇక్కడికి వచ్చిన ఐదుగురిలో వైరస్‌ ఉన్నట్లు గుర్తించారు. మరో నలుగురు మృతిచెందడంతో ఇప్పటి వరకు కొవిడ్‌తో చనిపోయిన వారి సంఖ్య 71కు చేరుకుంది.

ఆంధ్రప్రదేశ్‌లో శుక్రవారం మరో 85 కరోనా కేసులు నమోదయ్యాయి. అయితే, వీటిలో పొరుగు రాష్ట్రాలకు చెందిన వారివే 52 ఉండగా.. రాష్ట్రంలో 33 పాజిటివ్‌ కేసులు వచ్చాయి. పొరుగు దేశాలు, రాష్ట్రాల నుంచి వచ్చిన వారితో కలిపి రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం 3,330 కేసులు నమోదయ్యాయి.

తమిళనాడులో శుక్రవారం రికార్డు స్థాయిలో 874 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ప్రముఖ దినపత్రిక ‘దినతంతి’లో పనిచేసే 39 మంది ఉద్యోగులకు వైరస్‌ సోకింది. మొత్తం బాధితుల సంఖ్య 20,246కు పెరిగింది. మొత్తం మృతుల సంఖ్య 154కు పెరిగింది.Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *