ధోనీ సైలెంట్.. కోహ్లీ ఎమోషనల్: కోచ్ ఆప్టన్టీమిండియాకి కెప్టెన్సీ వహించే విషయంలో మహేంద్రసింగ్ ధోనీ, మధ్య పోలికేలేదని భారత్ జట్టు ఒకప్పటి మెంటల్ కండీషనింగ్ కోచ్ ప్యాడీ ఆప్టన్ అభిప్రాయపడ్డాడు. 2011 వన్డే ప్రపంచకప్ సమయంలో టీమిండియాతో కలిసి పనిచేసిన ప్యాడీ ఆప్టన్.. కోహ్లీ అప్పట్లో ఫిట్‌నెస్‌పై శ్రద్ధ కనబర్చడమే అతని కెరీర్‌ని మలుపు తిప్పిందని తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. అయితే.. కెప్టెన్సీలో మాత్రం ధోనీ సైలెంట్‌గా పనిచేసుకుంటూ పోతే.. కోహ్లీ మాత్రం ఎమోషనల్ అయిపోతుంటాడని ఆప్టన్ వివరించాడు.

‘‘మహేంద్రసింగ్ ధోనీ, విరాట్ కోహ్లీ కెప్టెన్సీ చాలా భిన్నంగా ఉంటాయి. ధోనీ స్ట్రాంగ్.. సైలెంట్ టైప్. కానీ.. కోహ్లీ మాత్రం ఎమోషనల్ టైప్. మైదానంలో కోహ్లీ తన హావభావాలతో సహచరుల్లో సైతం ఆ ఎనర్జీ నింపగలడు. ఇక తన స్ఫూర్తివంతమైన మాటలతోనూ ఆటగాళ్ల నుంచి అత్యుత్తమ ప్రదర్శనని అతను రాబట్టగలుగుతున్నాడు. కెరీర్ ఆరంభంలో బరువు పెరిగిన కోహ్లీ.. ఆ తర్వాత ఫిట్‌నెస్‌పై శ్రద్ధ వహించడంతో అతని కెరీర్ మలుపు తిరిగింది’’ అని ప్యాడీ ఆప్టన్ వెల్లడించాడు.

2014లో ధోనీ నుంచి టెస్టు టీమ్ పగ్గాలు అందుకున్న విరాట్ కోహ్లీ.. ఆ తర్వాత 2017లో వన్డే, టీ20 జట్టు కెప్టెన్సీ బాధ్యతలు తీసుకుని పూర్తి స్థాయి కెప్టెన్‌గా మారాడు. అనంతరం ఆస్ట్రేలియా గడ్డపై 72 ఏళ్ల నిరీక్షణ తర్వాత టెస్టు సిరీస్‌లో టీమిండియాని విజేతగా నిలిపిన కోహ్లీ.. ఆ ఘనత సాధించి తొలి ఆసియా కెప్టెన్‌గా రికార్డ్ నెలకొల్పాడు.Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *