న‌వ్వులు పూయిస్తున్న సానియా మీర్జా టిక్‌టాక్ వీడియోప్ర‌మాద‌క‌ర క‌రోనా వైర‌స్ విస్త‌ర‌ణ కార‌ణంగా ప్ర‌పంచ‌వ్యాప్తంగా క్రీడా కార్య‌క‌లాపాలు వాయిదా ప‌డ‌టంతో ప్లేయ‌ర్లంతా ఇంటికే ప‌రిమిత‌మైన సంగ‌తి తెలిసిందే. చాలామంది ప్లేయ‌ర్లు సోష‌ల్ మీడియాలో సంద‌డి చేస్తూ, అభిమానుల‌కు అందుబాటులో ఉంటున్నారు. తాజాగా భార‌త ఏస్ టెన్నిస్ ప్లేయ‌ర్ షేర్ చేసిన టిక్‌టాక్ వీడియో న‌వ్వులు పూయిస్తోంది. ఒక షాప్‌లో చిత్రీక‌రించిన ఈ వీడియో చాలా ఫ‌న్నీగా ఉంది. ఒక క‌స్ట‌మ‌ర్ దుకాణ‌దారు వ‌ద్ద‌కు వెళ్లి, ఒక చీటిని. చూపించి త‌న‌కో వ‌స్తువు కావాల‌ని అడుగుతాడు. అయితే అందులో సానియా ట్రౌజ‌ర్ అని రాసి ఉంటుంది.

Must Read:

అదేమిటో అర్ధం కాక ఏం కావాల‌ని క‌స్ట‌మ‌ర్‌ను దుకాణాదారు అడుగగా.. సానియా ట్రౌజ‌ర్ అని పేర్కొంటాడు. ఇంతకీ మీ నాన్న ఏం చేస్తుంటాడనే ప్ర‌శ్న‌కు ఆ క‌స్ట‌మ‌ర్ ఎమ్మెల్యే అని స‌మాధాన‌మిస్తాడు. కాసేపు ఆలోచించిన దుకాణ‌దారు.. అది శానిటైజ‌ర్ అని గ్ర‌హించి, షాక్ అవుతాడు. ఈ వీడియాపై నెటిజ‌న్లు కడుపుబ్బా నవ్వుతున్నారు. లైకులు, కామెంట్ల‌తో త‌మ స్పంద‌న‌ను హోరెత్తిస్తున్నారు.

Must Read:
మ‌రోవైపు క‌రోనా వేళ నిరుపేద‌ల‌ను, వ‌ల‌స కూలీల‌ను ఆదుకునేందుకు సానియా త‌న వంతు ప్ర‌య‌త్నాలు చేస్తోంది. ఇప్ప‌టికే విరాళాల‌ను సేక‌రించి, నిరుపేద కుటుంబాల‌కు సాయం చేసింది. తాజాగా ప్ర‌తిష్టాత్మ‌క ఫెడ్ క‌ప్ హార్ట్ అవార్డును గెలుపొందిన సానియా.. త‌న‌కు ల‌భించిన ప్రైజ్‌మ‌నీ 2వేల అమెరిక‌న్ డాల‌ర్ల ( సుమారు రూ.ల‌క్షా 58 వేలు)ను క‌రోనా పోరులో భాగంగా తెలంగాణ ముఖ్య‌మంత్రి స‌హాయ‌నిధికి విరాళ‌మిచ్చింది.Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *