పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సహాయకుడికి కరోనాఇమ్రాన్ ఖాన్ ప్రధాన సహాయకుడు కరోనా బారిన పడ్డాడు. పాక్ ప్రభుత్వంలో కీలక వ్యక్తి, సింధ్ ప్రావిన్స్ గవర్నర్ ఇమ్రాన్ ఇస్మాయిల్‌కు కరోనా పరీక్షల్లో పాజిటివ్ అని తేలింది. దీంతో పాక్ ప్రభుత్వం అప్రమత్తం అయ్యింది. వెంటనే అతన్ని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పాక్ లోని సింధ్ ప్రావిన్స్ లో అత్యధికంగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. సింధ్ ప్రావిన్స్ లో ఇప్పటి వరకు 4,956 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇటీవలే కు కరోనా టెస్టులు నిర్వహించగా… నెగెటివ్ గా తేలింది. కొన్ని రోజులు ఇమ్రాన్ కూడా సెల్ఫ్ క్వారంటైన్‌కి వెళ్లారు .

తాజాగా ముస్లీంల అతి పవిత్ర మాసం రంజాన్ ప్రారంభం కావడంతో… పలు షరతులతో మసీదులను తెరిచేందుకు అనుమతి ఇచ్చారు పాక్ ప్రధాని. అయితే కరోనా వేగంగా వ్యాప్తి చెందుతున్న వేళ వాటిని తెరవడంతో.. ఇప్పుడు దానికి తగిన మూల్యం చెల్లిస్తున్నారు. పాక్‌లో పాజిటివ్ కేసుల సంఖ్య అమాంతం పెరిగిపోయింది. ఇక పాకిస్తాన్ ఇస్లామిక్ మెడికల్ అసోసియేషన్ కూడా మసీదులను తెరవడం వల్లే కరోనా వేగంగా వ్యాప్తి చెందుతోందని ప్రభుత్వాన్ని హెచ్చరించింది. పాకిస్థాన్‌లో ఇప్పటివరకు 13915 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. అందులో 292 మంది మరణించారు.

అయితే ముస్లిం మత పెద్దల అల్టిమేటం వల్ల ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మసీదులపై నిషేధాన్ని ఎత్తివేశారని.. దీనితో సామూహిక ప్రార్ధనలు ఎక్కువగా జరుగుతున్నాయన్నాయని చెబుతున్నారు. రంజాన్ వేళ మసీదులు తెరుచుకునేందుకు పాక్ ప్రభుత్వం పలు నిబంధనలతో కూడిన అనుమతులు ఇచ్చిన సంగతి తెలిసిందే. సామాజిక దూరాన్ని తప్పనిసరి చేస్తూ.. సామూహిక ప్రార్ధనలు చేయకూడదని, అలాగే ప్రార్ధన చేసే చాపను ఎవరికి వాళ్లు తెచ్చుకోవాలంటూ పాక్ ప్రభుత్వం పలు సూచనలు చేసింది. అయినప్పటికీ అక్కడ వైరస్ శరవేగంగా వ్యాప్తి చెందడం ఇప్పుడు అందర్నీ కలవరపెడుతున్న అంశం.Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *