పాక్ క్రికెట్‌లో ఫిక్సింగ్ లొల్లి.. షోయబ్ అక్తర్‌కు నోటీసులుతమ దేశంలో తరచూ క్రికెటర్లు మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్ప‌డి, నిషేధానికి గుర‌వుతండ‌టంపై ఇటీవ‌ల పాకిస్థాన్ మాజీ పేస‌ర్ షోయ‌బ్ అక్త‌ర్ ఆవేద‌న వ్య‌క్తం చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ విష‌యంలో పాక్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఉదాసీన వైఖ‌రై కార‌ణ‌మ‌ని తను పేర్కొన్నాడు. అక్త‌ర్ తాజా వ్యాఖ్య‌ల‌పై భ‌గ్గుమంది. త‌నకు ప‌రువు న‌ష్టం నోటీసులు పంపింది. త‌న వ్యాఖ్య‌ల‌ను వెన‌క్కి తీసుకోవ‌డంతోపాటు రూ.ప‌ది కోట్ల పాక్ రూపాయ‌ల న‌ష్ట‌ప‌రిహారాన్ని చెల్లించాల‌ని నోటీసులో డిమాండ్ చేసింది.

Must Read:
బోర్డు త‌ర‌పున ఈ నోటీసును బోర్డు న్యాయ సలహాదారు తప్పాజుల్ రిజ్వీ పంపించారు. అక్త‌ర్ వ్యాఖ్య‌లు ఏమాత్రం ఆమోద‌యోగ్యం కాబోవ‌ని అన్నారు. త‌న వ్యాఖ్య‌ల‌ను వెన‌క్కి తీసుకోవ‌డంతోపాటు భ‌విష్య‌త్తులో ఇలాంటి వ్యాఖ్య‌లు చేయ‌బోన‌ని చెప్పాల‌ని డిమాండ్ చేశారు. అలాగే అక్త‌ర్ నుంచి వ‌సూలు చేసే న‌ష్ట‌ప‌రిహారాన్ని లాహోర్ హైకోర్టు మెడికల్ సెంటర్‌కు డొనేట్ చేయ‌నున్న‌ట్లు తెలిపారు.

Must Read:
క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్ర‌క‌టించాక యూట్యూబ్ చానెల్‌ను ఏర్పాటు చేసుకున్న అక్త‌ర్‌.. వివిధ అంశాల‌పై స్పందిస్తున్న సంగ‌తి తెలిసిందే. చాలాకాలం నుంచి బోర్డు వైఖరిపై రావాల్పిండి ఎక్స్‌ప్రెస్ విమ‌ర్శ‌లు చేస్తున్నాడు. తాజాగా అవినీతి కార్య‌క‌లా‌పాల‌కు పాల్ప‌డిన‌ క్రికెట‌ర్ ఉమ‌ర్ అక్మ‌ల్‌ నిషేధానికి గుర‌య్యాడు. ఈ విష‌యంలో బోర్డు వైఖ‌రిని అక్త‌ర్ ఘాటుగా ప్ర‌శ్నించాడు.Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *