పీరియడ్స్ టైమ్‌లో ఇవి అస్సలు చేయొద్దు..నెలసరి సమయంలో మహిళలకు చిరాగ్గా ఉంటుంది. ఆ సమయంలో వచ్చే కడుపు నొప్పి, ఉబ్బరం, అలసట, తిమ్మిరి, తలనొప్పి కొన్ని సార్లు చాలా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఆ సమయంలో చక్కగా విశ్రాంతి తీసుకోవాలని అనుకుంటాం. ఎటువంటి అలసట కలిగించే పనులు చేయాలనుకోం.. ముఖ్యంగా వ్యాయామం. కానీ నెలసరి సమయంలో వ్యాయామం నుండి విరామం తీసుకోవాల్సిన అవసరం లేదు. వాస్తవానికి, శరీరాన్ని చురుగ్గా ఉంచడం వల్ల నెలసరి సమయంలో ఇబ్బంది పెట్టే లక్షణాలను తగ్గించడానికి సహాయపడుతుంది. ఇందుకు అధిక శ్రమ కలిగిన వ్యాయామాలు చేయడం కొద్దిగా సవాలుగా మారవచ్చు, కానీ ఆ సమంయంలో చేసే కొన్ని వ్యాయామాలు చాలా మంచిది..

ప్రతి నెలా బ్లీడింగ్ అవుతుంది కాబట్టి రక్త హీనత రాకుండా బలమైన ఆహారం తీసుకోవాలి. ఆ సమయంలో శరీరం నీరసం రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. నెలసరి సమయంలో చాలా మంది వ్యాయామం చేయటానికి ఇష్టపడరు. కానీ, ఆ సమయంలో శరీరానికి వ్యాయామం ఎంతో మంచిది. అందుకే నెలసరి సమయంలో వ్యాయామాన్ని పక్కన పెట్టాల్సిన అవసరం లేదు. జీవనశైలిలో ఏ మార్పులు చేసుకోవాల్సిన అవసరం ఎంతమాత్రం లేదు.

నెలసరి ముందు..
నెలసరి లక్షణాలు ఒక వారం ముందుగానే కనిపించడం ప్రారంభిస్తాయి. ఆ సమయంలో మహిళలు ఎక్కువ అలసటతో, చిరాకుతో ఉంటారు, వ్యాయామ శాలకు వెళ్లటానికి చాలా కష్టం. ఈ సమయంలో మీరు కొంచెం నెమ్మదిగా మరియు తీవ్రమైన వ్యాయామం చేయకుండా, పైలేట్స్ లేదా రన్నింగ్ వంటి తక్కువ-తీవ్రత గల వ్యాయామాలను ఎంచుకోవచ్చు.

నెలసరి సమయంలో..

నెలసరి ఇబ్బందులు శారీరకంగా చురుగ్గా ఉండటాన్ని ఆపకూడదు. ఆ సమయంలో ఇబ్బందికరంగా, తిమ్మిరితో బాధపడవచ్చు, కానీ నెలసరి సమయంలో శారీరక శ్రమలో పాల్గొనడం ఇంకా మంచిది. మిగతా రోజుల్లాగా హార్డ్ వర్కవుట్స్ చేయలేం అనుకున్నా ఏం పర్వాలేదు. తేలికపాటి వ్యాయామం చేసినా మంచిదే.

నెలసరి సమయంలో చేయకూడని వ్యాయామాలు.

నెలసరి సమయంలో కొన్ని వ్యాయామాలు చేయకూడదు. పొట్ట మీద ఒత్తిడి పడే ఏ వ్యాయామాలు చేయకూడదు. ఎందుకంటే అందువల్ల ఎక్కువ రక్త స్రావం అయ్యే అవకాశం ఉంది. దీని వల్ల మరింత అలసట, నీరసంగా ఉంటుంది. అందుకే ఆ సమయంలో వీలైనంత వరకు తేలికపాటి వ్యాయామాలు చేయాలి.

నెలసరి సమయంలో చేసే వ్యాయామాలు…

నడక లేదా పరుగు: నడక అనేది సున్నితమైన మరియు తక్కువ తీవ్రత కలిగిన వ్యాయామం. మీరు హార్డ్‌వర్క్ ఏమీ చేయకూడదనుకుంటే, నడక చాలా మంచిది. ఇది మీ మానసిక స్థితిని పెంపొందించడానికి సాయపడుతుంది. అదే విధంగా, మీరు కొన్ని కేలరీలను బర్న్ చేయగలరు. నెలసరి సమయంలో వచ్చే తిమ్మిర్లు లేకపోతె పరుగు కోసం వెళ్ళవచ్చు.

పైలేట్స్: పైలేట్స్ వ్యాయామం నెలసరి సమయంలో సహాయపడుతుంది. మీ శారీరక స్థితి ప్రకారం మీరు వ్యాయామాలు చేయొచ్చు. ఒకవేళ మీరు తక్కువ వెన్ను నొప్పి సమస్యతో బాధపడుతుంటే, కొన్ని నిర్దిష్ట పైలేట్స్ కదలిక నొప్పి నుండి ఉపశమనం కలిగించడానికి సహాయపడుతుంది.

యోగా: యోగా స్ట్రెచ్బుల్ మరియు శ్వాస వ్యాయామాల కలయిక, ఇది నెలసరి సమయంలో యోగా చేయటం చాల మంచుడి. కొన్ని యోగా ఆసనాలు వల్ల శరీరంలో రక్త ప్రసరణను పెంచడానికి మరియు నెలసరి సమయంలో వచ్చే లక్షణాల నుండి తేలికగా బయటపడటానికి సహాయపడుతుంది.

డ్యాన్స్: డ్యాన్స్ అనేది ఒక ఆహ్లాదకరమైన చర్య, ఇది మీకు ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడుతుంది. మరియి మీ శారీరాన్ని ఫిట్ గ ఉంచుటింది. ఆ సమయంలో డాన్స్ చేస్తే ఆహ్లాదకరంగా మరియు ప్రశాంతంగా ఉంటుంది. ఇది మిమ్మల్ని ఉత్సాహపర్చడానికి కూడా సహాయపడుతుంది.

నెలసరి సమయంలో ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటుంది. కొందరికి అధిక రక్త స్రావం అవుతూ ఉండుండి. అలంటి వారు డాక్టర్ ను అడిగి అడిగి తేలికపాటి వ్యాయామం లేదా ఉదయం లేదా సాయంత్రం సమయాల్లో నడిస్తే మంచిది.Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *