పుట్టినరోజు నాడు బెన్‌స్టోక్స్‌ని ఏడిపిస్తున్న విరాట్ కోహ్లీ ఫ్యాన్స్టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, ఇంగ్లాండ్ స్టార్ ఆల్‌రౌండర్ మధ్య సుదీర్ఘకాలంగా ఆధిపత్య పోరు జరుగుతోంది. ఫార్మాట్‌ ఏదైనా ఇప్పటికీ బెన్‌స్టోక్స్ వికెట్ పడితే మైదానంలో కోహ్లీ సంబరాలు పతాక స్థాయిలో ఉంటాయి. మరోవైపు బెన్‌స్టోక్స్ కూడా కోహ్లీపై ఏ చిన్న విమర్శ తెరపైకి వచ్చినా.. సోషల్ మీడియాలో పెట్టి మరీ వెటకారంగా ఏకిపారేస్తుంటాడు. దాంతో.. స్టోక్స్‌ తీరుపై గత కొంతకాలంగా గుర్రుగా ఉన్న విరాట్ కోహ్లీ అభిమానులు.. ఈరోజు 29వ పుట్టినరోజు జరుపుకుంటున్న బెన్‌స్టోక్స్‌‌ని సోషల్ మీడియాలో ఏడిపించేస్తున్నారు.

బెన్‌స్టోక్స్ వికెట్ పడిన సమయంలో విరాట్ కోహ్లీ ఓ అసభ్య పదాన్ని వినియోగించిన వీడియోని షేర్ చేస్తూ మరీ అతనికి కోహ్లీ అభిమానులు బర్త్‌డే విషెస్ చెప్తున్నారు. వాస్తవానికి విరాట్ కోహ్లీ వాడిన పదం బూతు కాదని గత ఏడాది వివరణ ఇచ్చిన బెన్‌స్టోక్స్.. నా పేరుని అందులో పలికాడని చెప్పుకొచ్చాడు. కానీ.. అది పక్కా అసభ్య పదమని అందరికీ స్పష్టంగా తెలుస్తోంది. అయితే.. పుట్టినరోజు నాడే మళ్లీ అదే పదాన్ని తెరపైకి తెచ్చి భారత్ అభిమానులు విషెస్ చెప్పడం బెన్‌స్టోక్స్‌‌కి కోపం తెప్పించే విషయమే..!

2019లో పరుగుల వరద పారించిన బెన్‌స్టోక్స్.. 2020 విజ్డెన్ క్రికెటర్‌గా ఎంపికయ్యాడు. ఇంగ్లాండ్‌కి అందని ద్రాక్షగా కనిపించిన ప్రపంచకప్‌ని.. ఫైనల్లో తన అద్భుత ఆటతీరుతో బెన్‌స్టోక్స్ ఆ దేశానికి అందించాడు. ఆ తర్వాత యాషెస్ సిరీస్‌లోనూ అతని జోరు కొనసాగింది. మొత్తంగా.. గత ఏడాది టెస్టుల్లో 821 పరుగులు చేసిన బెన్‌స్టోక్స్, వన్డేల్లో 719 పరుగులు చేశాడు. దాంతో.. అతనికి 2019కిగానూ ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద అవార్డు కూడా లభించింది.Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *