పోలీస్ స్టేషన్ ముందే మనిషి గొంతుకోసి.. కడపలో ఘోరంచిన్ననాటి స్నేహితులపై కక్ష పెంచుకున్న వ్యక్తి వారిని అంతమొందించేందుకు పక్కా ప్లాన్ చేశాడు. ఇద్దరినీ హత్య చేసేందుకు వెళ్లి అడ్డంగా బుక్కయ్యాడు. టార్గెట్ చేసిన ఇద్దరు ఫ్రెండ్స్ అప్రమత్తం కావడంతో పరుగులంకించుకున్నాడు. అయినా వదలని స్నేహితులు ఏకంగా పోలీస్ స్టేషన్ ఎదుటే గొంతుకోసేశారు. ఈ దారుణ ఘటన పట్టణంలో చోటుచేసుకుంది.

పోలీస్ స్టేషన్‌ సమీపంలో వ్యక్తి గొంతుకోసి హత్యాయత్నం చేసిన దారుణ ఘటన జరిగింది. కడపకు చెందిన ఖాదర్, బాలాజీ, శాలు చిన్నతనం నుంచి స్నేహితులు. ఇటీవల వారి మధ్య మనస్పర్థలు రావడంతో ఖాదర్ కక్ష పెంచుకున్నాడు. తన ఇద్దరు స్నేహితులను అంతమొందించాలని నిర్ణయించుకున్నాడు. మద్యం మత్తులో వారిని హత్య చేసేందుకు వెళ్లాడు.

Also Read:

నిద్రపోతున్న బాలాజీ గొంతుకోసేందుకు ప్రయత్నించడం చూసి శాలు అడ్డుకున్నాడు. ఆగ్రహం చెందిన ఖాదర్ అతనిపై కూడా దాడికి దిగాడు. ఈలోగా బాలాజీ నిద్ర నుంచి తేరుకుని అప్రమత్తం కావడంతో ఇద్దరినీ ఎదుర్కోలేక ఖాదర్ అక్కడి నుంచి పారిపోయేందుకు యత్నించాడు. భయంతో పరిగెడుతూ ఖాదర్‌ కడప వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ సమీపంలో ‌ కిందపడిపోవడంతో శాలు కత్తితో ఖాదర్ గొంతుకోసేశాడు.

విషయం తెలుసుకున్న పోలీసులు అప్రమత్తమై నిందితులు బాలాజీ, శాలుని అదుపులోకి తీసుకున్నారు. తీవ్రగాయాలపాలైన ఖాదర్‌ని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఖాదర్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోలీసు విచారణ అనంతరం పూర్తి వివారాలు తెలిసే అవకాశం ఉంది.

Read Also:Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *