ప్రధాని మోదీకి ఆర్సీబీ డైరెక్టర్ హెస్సన్ స్పెషల్ థ్యాంక్స్ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి న్యూజిలాండ్‌కు చెందిన మైక్ హెస్సన్ కృత‌జ్ఞ‌త‌లు తెలిపాడు. క‌రోనా వైర‌స్ కార‌ణంగా ఇండియాలో లాక్‌డౌన్ విధించిన సంగ‌తి తెలిసిందే. ఐపీఎల్లో రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు టీమ్ డైరెక్ట‌ర్‌గా హెస్స‌న్ వ్య‌వ‌హ‌రిస్తున్నాడు. లీగ్ కోసం గ‌త‌నెల‌లో హెస్స‌న్ భార‌త్‌కు వ‌చ్చాడు. అయితే లాక్‌డౌన్ కార‌ణంగా త‌ను ఇక్క‌డే చిక్కుకుపోయాడు. ఇటీవ‌లే కేంద్ర ప్ర‌భుత్వం.. మ‌న‌దేశంలోని విదేశీయుల‌ను వాళ్ల స్వదేశాల‌కు పంపిన సంగ‌తి తెలిసిందే. ఈ జాబితాలో హెస్స‌న్ నిలిచాడు.

Must Read:
దాదాపు నెల‌రోజుల త‌ర్వాత ఇంటికి చేరుకోవ‌డంపై హెస్స‌న్ ఆనందం వ్య‌క్తం చేశాడు. క‌రోనాలాంటి క్లిష్ట ప‌రిస్థితుల్లో త‌మ‌ను స్వదేశానికి పంపిన ప్ర‌ధాని మోదీకి కృత‌జ్ఞ‌త‌లు తెలిపాడు. మ‌రోవైపు క‌రోనా కార‌ణంగా ప్ర‌తిష్టాత్మ‌క ఐపీఎల్‌, ఒలింపిక్స్ టోర్నీలు వాయిదా ప‌డిన‌ సంగ‌తి తెలిసిందే. క‌రోనా వైర‌స్ ఇంకా అదుపులోకి రాక‌పోవ‌డంతో ఈ టోర్నీలు ఎప్పుడు జరుగుతాయో చెప్ప‌లేని ప‌రిస్థితి నెల‌కొని ఉంది. మ‌రోవైపు క‌రోనా వైర‌స్ మ‌న‌దేశం వేగంగా విస్త‌రిస్తోంది. ఇప్పటివ‌ర‌కు 30,400 మందికిపైగా క‌రోనా పాజిటివ్‌గా తేలారు. అలాగే 970 మందికిపైగా మృత్యువాత ప‌డ్డారు.Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *