ప్రేమించి పెళ్లి.. ఆ పనికి అడ్డుగా ఉన్నాడని ప్రియుడితో కలిసి.. దారుణం!అక్రమ సంబంధాలు కుటుంబాలను కూలుస్తున్నాయి. అక్రమ సంబంధాలు పెట్టుకుని కట్టుకున్న వారిని చంపుతున్న సంఘటనలు నిత్యం ఎక్కడో ఓ చోట జరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా ఇలాంటి సంఘటన మహానగరంలో చోటు చేసుకుంది. ప్రేమించి, పెళ్లి చేసుకున్న వ్యక్తినే ప్రియుడితో కలిసి ఓ మహిళ కిరాతకంగా హత్య చేసింది. తమ అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడన్న కారణంతో వారు ఈ దుర్మార్గానికి పాల్పడ్డారు. ఎట్టకేలకు పాపం బయటపడడంతో నిందితురాలు, ఆమె ప్రియుడు, వారికి సహకరించిన మరొకరిని పోలీసులు అరెస్టు చేశారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. డెంకణికోటకు చెందిన ప్రేమ, మాదేశ్‌ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి ఓ కూతురు కూడా ఉంది. మాదేశ్‌ టైలర్‌గా, ప్రేమ ఓ గార్మెంట్స్‌లో పనికి వెళ్లేది. ఆనందంగా సాగుతున్న వీరి జీవితంలో మరో వ్యక్తి ప్రవేశించాడు. కరోనా నేపథ్యంలో లాక్ డౌన్ విధించడంతో ప్రేమ ఇంటి వద్దే ఉండేది. ఈ సమయంలో ప్రేమకు శివమల్ల అనే వ్యక్తితో పరిచయమైంది. కొన్ని రోజులకు ఆ పరిచయం వివాహేతర సంబంధంగా మారింది. ఇద్దరూ పెళ్లి చేసుకుని పారిపోవాలనుకున్నారు. అయితే ఇందుకు తన భర్త మాదేశ్ అడ్డుగా ఉన్నాడని ప్రేమ భావించింది. దీంతో అతడిని చంపేయాలని ప్రియుడితో కలిసి ప్లాన్ చేసింది.

ఈ తరుణంలో ఈ నెల 17 తేదీ రాత్రి మాదేశ్‌ను తీవ్రంగా కొట్టారు. చనిపోయాడని నిర్ధారించుకున్న తర్వాత అక్కడి నుంచి పారిపోయారు. ఈ విషయమై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేశారు. దర్యాప్తులో ప్రేమ, శివమల్లు ఇద్దరిని నిందితులుగా గుర్తించారు. అలాగే వీరికి సహకరించిన మల్లేశ్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు.Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *