ప్లాస్టిక్ బాటిల్స్ పాడేస్తున్నారా.. ఇకనుంచి ఇలా రియూజ్ చేయండి..వాటర్ బాటిల్స్ దగ్గర నుంచి తేనె వరకూ, లిక్విడ్ సోప్స్ దగ్గర నుంచి షాంపూ బాటిల్స్ వరకూ, అన్నీ ప్లాస్టిక్ బాటిల్సే. వీటిని చాలా మంది పారేస్తుంటారు. అలా కాకుండా కాస్తా క్రియేటివిటీగా ఆలోచిస్తే వీటిని కూడా వెంటనే బయట పారెయ్యకుండా కొంచెం యూజ్ ఫుల్‌గా ఎలా మలుచుకోవచ్చో చూడండి.

1. పెన్ హోల్డర్స్..
మీరు తాగేసిన కూల్ డ్రింక్ బాటిల్స్‌ని జాగ్రత్తగా కట్ చేసి పెన్ హోల్డర్స్ లానో, క్రేయాన్స్ పెట్టుకోడానికి వీలుగా తయారుచేయండి. ఇది మీరూ, మీ పిల్లలూ కలిసి చేస్తే వాళ్ళకి కూడా మీరు రీయూజింగ్‌ని పరిచయం చేసినట్లు అవుతుంది, వాళ్ళకి కూడా సరదాగా ఉంటుంది.

2. స్నాక్స్ స్టోర్ చేసేందుకు..
ఎన్ని డబ్బాలున్నా కిచెన్‌లో సరిపోవు. ఇంకా చాలా ఏదో అవసరం వస్తుంటాయి,ఇంకో డబ్బా కావాలి. అలాంటప్పుడు ఇలా చేయండి. కొన్ని ప్లాస్టిక్ బాటిల్స్‌ని క్లీన్ చేసి పెట్టుకుంటే ఇలాంటి అవసరాలకి వాడుకోవచ్చు. పక్కింటివాళ్ళకి ఏమైనా పంపించాలన్నా ఇవి యూజ్ చేసుకోవచ్చు.

3. మొక్కలు పెంచేందుకు..

రెండు లీటర్ల కూల్ డ్రింక్ బాటిల్స్ ఉంటాయి. వీటిని అనేక రకాలుగా వాడుకోవచ్చు. బాటిల్ పైన ఒంపు తిరిగే దగ్గర కట్ చేసెయ్యండి. దాన్ని చెవుల షేప్‌లో కత్తిరించండి. ఆ బాటిల్‌కి మీకు ఇష్టమైన కలర్ వేయండి. అదే కలర్ ఈ చెవులకి కూడా వెయ్యండి. బాటిల్ మీద ఈ చెవులు అతికించి కళ్ళూ, ముక్కూ, నోరూ గియ్యండి. అందులో మట్టి వేస్తే మొక్కలు పెంచుకోడానికి రెడీ.

4. లిక్విడ్ డిటర్జెంట్స్ తో వాటర్ క్యాన్స్..
లిక్విడ్ డిటర్జెంట్ డబ్బాలని వాటర్ కాన్స్ గా మార్చొచ్చు. అందులో ఉన్న డిటర్జెంట్ అంతా వాడేసిన తరువాత దాన్ని శుభ్రం గా కడిగేసి దానిలో నీళ్ళు పోసి మొక్కలకి నీళ్ళు పోయడానికి వాడుకోవచ్చు. అయితే దాని మీద ఉన్న లేబుల్ తీయండి. లేదంటే పొరపాటున మొక్కలకి డిటర్జెంట్ పోసే ప్రమాదం ఉంది.

5. పిగ్గీ బ్యాంక్‌లా..

బాటిల్ ని పడుకోబెట్టి దాని మీద ఒక పెద్ద కాయిన్ పట్టేలా హోల్ చేయండి. మీ పిగ్గీ బ్యాంక్ తయారైపోయింది. ఈ బాటిల్ కి మీరు కలర్ వెయ్యచ్చు, అలాగే వదిలెయ్యచ్చు, దానికి మీకు ఇష్టమైన డెకరేషన్స్ అన్నీ చేసుకోవచ్చు.

6. ఛార్జింగ్ డాక్
వెడల్పు గా ఉండే ఏ బాటిల్ అయినా దీనికి పనికొస్తుంది. లోషన్ బాటిల్స్, డే క్రీం / నైట్ క్రీం బాటిల్స్ ని వీటికి వాడుకోవచ్చు. మీకు కావలసిందల్లా ఒక బాక్స్ కట్టర్, డెకరేటివ్ పేపర్. మీకు నచ్చిన షేప్ లో ఈ బాటిల్ కట్ చేసి దానికి ఈ డెకరేటివ్ పేపర్ అంటిస్తే సరిపోతుంది.

7. చీపురులా..

పల్చటి తో వాకిట్లో ఊడ్చుకోడానికి చీపురు తయారు చెయ్యచ్చు. ఈ బాటిల్స్ ని జాగ్రత్తగా ఒకే పొడవు లో కట్ చేసి వాటికి ఒక చివర గట్టి తాడు తోనో, పురికొస తోనో కట్టేస్తే సరిపోతుంది. మీరు రంగు రంగుల బాటిల్స్ వాడితే మీ చీపురు కూడా కలర్ ఫుల్ గా తయారౌతుంది.

8. బొమ్మలుగా..
మీ పిల్లలతో కలిసి అల్లరి చేసేందుకు మీకు మరో అవకాశం. వీటికి షాంపూ బాటిల్స్ బాగా పనికొస్తాయి. మీ క్రియేటివిటీ అంతా యూజ్ చేసి పిల్లలతో కలిసి విమానాలూ, హెలికాప్టర్లూ, కార్లూ, జీపులూ తయారు చేయండి. దసరాకో, సంక్రాంతికో మీ ఇంట్లో బొమ్మల కొలువు పెట్టే అలవాటు ఉంటే ఈ సారి ఓ విమానాశ్రయం, ఒక కార్ షోరూమ్ కూడా అందులో పెట్టుకోండి.

9. వెర్టికల్ గార్డెన్‌లా..
ఈ గార్డెన్ తయారు చేయడానికి ముందు మీకు చాలా 2 లీటర్ కూల్ డ్రింక్ బాటిల్స్ సేకరించాలి. అవి ఒక ఇరవై పాతిక దాకా వచ్చాక అప్పుడు ఈ ప్రాజెక్ట్ మొదలు పెట్టండి. మీకు ఇందుకోసం బట్టలు ఆరేసుకునే గట్టి తీగ, ట్వైన్ దారం లాంటివి కావాలి. ఇది కొంచెం ఓపిగ్గా చేసుకోగలిగితే మీ ఇంటి చుట్టూ హరితవనం ఏర్పడుతుంది.

10. మూతలతో లాంప్ షేడ్స్
చివరా ఆఖరికి మూతల దగ్గరికి వద్దాం. బాటిల్స్ తో ఏం చేయాలో చూశాం, మరి మూతల్ని వదిలేయలేం కదా. వీటితో లాంప్ షేడ్స్ చేయొచ్చు, ఒకదాని పక్కన ఒకటి అతికించి ఫ్లవర్ వాజ్ చేయొచ్చు. గుండ్రంగా అతికించి కావాలసిన రంగులు వేసుకోవచ్చు. ఇది మీ పిల్లలకి చెప్పండి. వాళ్ళ క్రియేటివిటీ మీరే షాక్ అవుతారు.Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *