ఫిజికల్ లిటరసీపై అందరూ దృష్టి సారించాలి: గోపీచంద్‌మ‌న‌దేశంలో ఫిజిక‌ల్ లిట‌ర‌సీపై అంద‌రూ దృష్టి సారించాల‌ని భార‌త బ్యాడ్మింట‌న్ చీఫ్ కోచ్ అభిప్రాయ‌ప‌డ్డాడు. ఈఎల్ఎంఎస్ స్పోర్ట్స్ ఫౌండేష‌న్ నిర్వ‌హించిన ఓ కార్య‌క్ర‌మంలో గోపీచంద్ ప్ర‌సంగించాడు.ఈ కార్య‌క్ర‌మంలో ప్ర‌ముఖ ఫిలాస‌ఫర్ మార్గ‌రెట్ వైట్‌హెడ్‌, ఒలింపిక్ విన్న‌ర్ అభిన‌వ్ బింద్రా త‌దిత‌రులు పాల్గొన్నారు. ఈకార్య‌క్ర‌మంలో గోపీ మాట్లాడుతూ.. జీవితంలో ఫిజిక‌ల్ లిట‌ర‌సీ కీల‌క‌మైన‌దని గుర్తు చేశాడు. ప్ర‌తి ఒక్క‌రూ ఫిజిక‌ల్ యాక్టివిటీని త‌ప్ప‌నిస‌రిగా జీవితంలో భాగం చేసుకోవాల‌ని సూచించాడు. కోవిడ్‌-19 లాంటి ప్ర‌మాద‌క‌ర వైర‌స్ నెల‌కొన్న ప‌రిస్థితుల్లో ఆరోగ్యం, ఫిట్‌నెస్ త‌దిత‌ర అంశాల‌పై అంద‌రూ దృష్టి సారించాల‌ని తెలిపాడు.

మ‌రోవైపు ఫిజిక‌ల్ లిట‌ర‌సీ విస్తరించడంలో దేశ అధినాయకత్వం సహాయ‌,స‌హ‌కారాలు అందించాల‌ని గోపీచంద్ పేర్కొన్నాడు. దేశాభివృద్ధిలో ఈ లిట‌ర‌సీ మూల స్తంభంలాంటిద‌ని తెలిపాడు. మార్గరేట్ మాట్లాడుతూ.. ప్ర‌స్తుతం మ‌నం ఎదుర్కొంటున్న స‌వాలుతో కూడిన ప‌రిస్థితుల్లో ఆరోగ్య‌క‌ర‌మైన‌ జీవితానికి ఎంతో ప్రాధాన్యత ఇవ్వాలని పేర్కొన్నారు. ప్ర‌స్తుతమున్న ప్ర‌మాదక‌ర ప‌రిస్థితుల్లోనే గాకుండా, భ‌విష్య‌త్తులో కూడా ఫిజిక‌ల్ లిట‌ర‌సీపై అంద‌రూ దృష్టి సారించాల‌ని ఆమె సూచించారు.Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *