ఫేస్ మాస్క్‌ని క్లీన్ చేసే టిప్స్: మీరు తయారు చేసిన మాస్క్‌ని రోజూ ఎలా క్లీన్ చేయాలంటే.. – maskindia you should follow these steps for clean and sanitize your homemade masks everyday


ఇంట్లోనే తయారు చేసిన మాస్క్‌లని కచ్చితంగా రోజూ క్లీన్ చేస్తుండాలి.

మార్కెట్లో దొరికే డిస్పోజబుల్(సర్జికల్ మాస్క్)‌ని ఒక్కసారి వాడగానే వాటిని కచ్చితంగా పారేయాలి. కానీ, ఇంట్లో కాటన్ క్లాత్‌తో తయారు చేసిన మాస్క్‌ని మనం రోజూ క్లీన్ చేసుకుని హ్యాపీగా వాడుకోవచ్చు.

ఇప్పుడు ఇంట్లోనే తయారైన మాస్క్‌ని ఎలా క్లీన్ చేసుకోవాలో చూద్దాం..
ఆప్షన్ 1:ముందుగా ఇంట్లో తయారు చేసిన మాస్క్‌ని వేడి నీటిలో సబ్బు వేసి అందులో కాసేపు ఉంచాలి. ఆ తర్వాత దానిని బాగా ఉతకాలి. ఇలా ఉతికిన మాస్క్‌ని ఎండలో కచ్చితంగా 5 గంటల పాటు ఆరవేయాలి.

ఆప్షన్ 2 : ఒకవేళ మీరు ఉంటున్న స్థలంలో ఎండలేకపోతే.. వాడిన మాస్క్‌ని ప్రెజర్ కుక్కరల్‌లో వేసి కనీసం 10 నిమిషాల పాటు ఉడకబెట్టి ఆరేయాలి. ఆ నీటిలో ఉప్పు వేస్తే మంచిది. కుక్కర్ లేకపోయినట్లైతే దానిని వేడినీటిలో 15 నిమిషాల పాటు ఉడకబెట్టొచ్చు.

ఆప్షన్ 3.. :మీకు కుక్కర్, వేడి నీటిని వాడే వీలు కూడా లేకపోతే..మాస్క్‌ని సబ్బుతో శుభ్రం చేసి దానిని 5 నిమిషాల పాటు మీడియం వేడితో ఐరన్ చేయొచ్చు.Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *